ఐఐటీలు, ఐఐఎంల్లో...నూతన కోర్సులు ఇవే
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంలో ముందుంటాయి. అవసరాలకు తగినట్టుగా విద్యార్థులకు శిక్షణనిస్తుంటారుు. అందుకే ఈ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఏ కోర్సులో చేరినా.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా కార్పొరేట్ కంపెనీల్లో ఆకర్షణీయ ఆఫర్లు లభిస్తున్నాయి. అలాగే ఐఐఎంలకు మేనేజ్‌మెంట్ కోర్సులను అందించడంలో మంచి పేరుంది. ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థలు అందిస్తున్న కొత్త కోర్సులపై ప్రత్యేక కథనం..
డిప్లొమా ఇన్ జియోడెసీ :
భౌగోళిక స్వరూపం, నావిగేషన్, మ్యాపింగ్, రిమోట్ సెన్సింగ్, జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(జీఐఎస్) వంటి అంశాలపై సమగ్ర విశ్లేషణాత్మ సమగ్ర కోర్సును ‘డిప్లొమా ఇన్ జియోడెసీ’(భూమిని కొలిచే విజ్ఞాన శాస్త్రం) పేరుతో కాన్పూర్ ఐఐటీ అందుబాటులోకి తెచ్చింది. భూకంపాలు, అగ్నిపర్వతాలు, కొండచరియలు, వాతావరణ ప్రమాదాల గుర్తింపునకు జియోడెసీ కోర్సు ఉపయోగపడుతుంది. ఏడాది కాలపరిమితి గల ఈ కోర్సు సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్‌స, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎర్త్ సైన్‌సతో పాటు ఇతర ఇంజనీరింగ్ కోర్సులు చేసిన వారు కూడా చేరవచ్చని ఈ ఐఐటీ చెబుతోంది. సివిల్ ఇంజనీరింగ్‌లో జియో ఇన్ఫర్మేటిక్స్ స్పెషలైజేషన్‌తో ఎంటెక్/ఎంఎస్ చేసినవారికి కూడా ఈ డిప్లొమా కోర్సు ఎంతో ఉపయోగపడుతుంది. ఐఐటీలు అందించే పీజీ కోర్సుల్లో చేరాలంటే గేట్ స్కోర్ ఉండాలి. కానీ వృత్తి నిపుణులకు ‘డిప్లొమా ఇన్ జియోడెసీ’ కోర్సులో చేరేందుకు గేట్ స్కోర్ మినహారుుంచారు. ఈ కోర్సుకు క్యాంపస్‌లో ఆధునిక ల్యాబొరేటరీల సౌకర్యంతోపాటు జియోడెసీ, రిమోట్ సెన్సింగ్, లేజర్ స్కానింగ్, ఫోటోగ్రామెట్రీ, జిఐఎస్, సెన్సార్ ఇంటిగ్రేషన్‌లో విస్తృత పరిశోధన అనుభవం గల నిష్ణాతులు ఫ్యాకల్టీగా వ్యవహరిస్తారు.
వెబ్‌సైట్: https://www.iitk.ac.in/
అడ్వాన్స్‌డ్ సైబర్ సెక్యూరిటీ...
{పపంచ వ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలను గుర్తించి, నిరోధించే నిపుణుల కొరత ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐఐటీ కాన్పూర్.. సైబర్ సెక్యూరిటీలో కొత్త కోర్సును అందుబాటులోకి తెచ్చింది. ‘అడ్వాన్స్‌డ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ డిఫెన్‌స’ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తోంది. సెక్యూరిటీ టెక్నాలజీలలోని ఆధునిక పోకడలను అవగాహన చేసుకునేందుకు.. నేరాలను అరికట్టేందుకు వీలుగా శిక్షణ ఇచ్చేందుకు ఈ కోర్సు ఉపయోగపడుతుందని ఇన్‌స్టి ట్యూట్ చెబుతోంది. సైబర్ సెక్యూరిటీలో అంతర్జాతీయ స్థారుు నిష్ణాతులను తీర్చిదిద్దడం, ఈ రంగంలో లోతైన పరిశోధనలు, క్లిష్టమైన సాంకేతిక భద్రతకు అవసరమైన స్టార్టప్స్‌ను రూపొందించడం ఈ కోర్సు ప్రధాన ఉద్దేశమని ఐఐటీ కాన్పూర్ పేర్కొంటోంది. ఈ కోర్సు కోసం సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ డిఫెన్‌స ఆఫ్ క్రిటికల్ ఇన్‌ప్రాస్ట్రక్చర్(సి3ఐ)’ పేరుతో క్యాంపస్‌లో ఇంటర్ డిసిప్లినరీ సెంటర్‌ను సైతం అందుబాటులోకి తెచ్చింది. ఆరు నెలల కాలపరిమితి గల ఈ కోర్సులో చేరేందుకు ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ నిపుణులుగా పనిచేస్తున్న వారు, యుటిలిటీస్, ఫైనాన్‌స, బ్యాంకింగ్ లేదా ఐటీ ప్రొఫెషనల్ ఇంజనీర్స్, సైబర్ సెక్యూరిటీలో ఏడాది అనుభవం ఉన్న గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్, మూడేళ్ల అనుభవం ఉన్న డిప్లొమా హోల్డర్స్ అర్హులు.
పూర్తి వివరాలకు: https://security.cse.iitk.ac.in/
పీజీ సర్టిఫికెట్ ఇన్ డెటాసైన్‌స :
{పస్తుతం ప్రపంచమంతా డేటాసైన్‌స-కృత్రిమ మేధ చుట్టూ తిరుగుతోంది. అన్ని రంగాలలోను ఈ టెక్నాలజీ పరిజ్ఞానం తప్పనిసరిగా మారింది. దీంతో డేటాసైన్‌సలో నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటీ-హెచ్).. ఎనిమిది నెలల ‘పోస్టు గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ఇన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ ఫర్ డేటాసైన్‌స’ కోర్సును ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్ విధానంలో శిక్షణ పొందేందుకు వీలున్న ఈ కోర్సు ఇప్పటికే ఈ రంగంలో ఉన్న ప్రొఫెషనల్స్‌కు ఎంతో ఉపయోగపడుతుందని సంబంధిత ప్రొఫెసర్లు చెబుతున్నారు. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నవారు తమ విరామ సమయంలో ఈ కోర్సులో చేరడం ద్వారా నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు. ఇంజనీరింగ్ చేసి టెక్నాలజీ నిపుణులుగా ఉన్నవారు.. డేటాసైన్‌సలో నైపుణ్యం కోరుకునేవారు.. తమ కంపెనీలు/సంస్థల్లో డేటాసైన్‌సను ప్రవేశపెట్టాలనుకునే టెక్ మేనేజర్స్.. సాఫ్ట్‌వేర్ అండ్ డేటాసైన్‌స విభాగంలో సేవలు అందిస్తూ ఇందులో ప్రత్యేకమైన నైపుణ్యం కోరుకునేవారు.. డేటాసైన్‌స ఉద్యోగాల్లో చేరిన ప్రెషర్స్ ఈ కోర్సులో చేరేందుకు అర్హులు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : https://www.greatlearning.in/post-graduate-course-software-engineering-iiit-hyderabad
సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ :
బిజినెస్‌లో ఖర్చు తగ్గించడం, ఆదాయాన్ని పెంచడం, మెరుగైన ఉత్పత్తి మార్గాలను కనుగొనేందుకు ఉపయోగపడే కొత్త కోర్సును ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-లక్నో(ఐఐఎంఎల్) ప్రవేశపెట్టింది. ఏడాది కాలపరిమితి గల ‘సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ ఫర్ ఎగ్జిక్యూటివ్స్’(సీపీబీఏఈ) అందుబాటులోకి తెచ్చింది. అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీకి చెందిన కెల్లీ స్కూల్ ఆఫ్ బిజినెస్(కేఎస్‌బీ) భాగస్వామ్యంతో అందిస్తున్న ఈ కోర్సులో వ్యాపార వ్యూహం, వ్యాపార విశ్లేషణ, ఎంచుకున్న వ్యాపార ప్రాంతాలలో అనలిటిక్స్ వంటి అంశాలపై అధ్యయనం చేస్తారు. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో మెరుగైన విధానాలు ప్రవేశపెట్టేందుకు ఈ కోర్సు దోహదం చేస్తుంది. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ 50 శాతం మార్కులతో పూర్తిచేసి, కనీసం మూడేళ్ల వ్యాపార అనుభవం ఉన్నవారు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : www.iiml.ac.in, https://www.iiml.ac.in