ఐఐటీల్లో కొత్త కోర్సులు...ప్రవేశం పొందండిలా..
Sakshi Education
ఉన్నత ప్రమాణాలతో కోర్సులను అందించి విద్యార్థులను తీర్చిదిద్దడంలో దేశంలోని ఐఐటీలు ముందుంటాయి.
ఇక్కడ అందించే కోర్సులు ఎప్పుడూ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. అందుకే ఐఐటీల్లో విద్యను అభ్యసించిన వారికి కార్పొరేట్ కంపెనీలు రెడ్‌కార్పెట్ స్వాగతం పలుకుతుంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న పలు ఐఐటీలు ఈ విద్యా సంవత్సరం నుంచి కొన్ని కొత్త కోర్సులు ప్రవేశపెట్టాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్ స్కోర్ ఆధారంగా ఆయా కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. ఈ నేపథ్యంలో... ఐఐటీల్లో కొత్త కోర్సుల వివరాలు...
ఐఐటీ–ఢిల్లీ :
దేశంలో ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటైన ఐఐటీ ఢిల్లీ ‘స్కూల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఎస్‌ఐఐ)’ను ఏర్పాటు చేసింది. ఈ విభాగం ద్వారా వచ్చే ఏడాది(2021) జనవరి నుంచి ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ను అందించనుంది. దీంతోపాటు పీజీ స్థాయిలో ఎంటెక్/ఎంఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులో ప్రవేశాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఐఐటీ మద్రాస్ :
దేశంలో టాప్ ఇన్‌స్టిట్యూట్‌గా కొనసాగుతున్న ఐఐటీ మద్రాస్.. బీటెక్‌లో ‘బయోమిమిక్రీ’ కోర్సును ప్రారంభించింది. ఇది ఫుల్ సెమిస్టర్ కోర్సు. బయోమిమిక్రీ అనేది బయాలజీ, ఇంజనీరింగ్ కలయికతో ఏర్పాడిన కోర్సు. దీనిద్వారా ప్రకృతిలోని క్లిష్టమైన సమస్యలు పరిష్కరించే అవకాశం ఏర్పడుతుంది. బయో మిమిక్రీ నేర్చుకోవడానికి మీరు జీవశాస్త్రవేత్త లేదా ఇంజనీర్ కానవసరం లేదు. నేర్చుకోవాలన్న తపన ఉన్నవారు ఈ కోర్సులో చేరి..ప్రకృతిలోని ప్రాణి పుట్టుక, జీవన విధానంపై అధ్యయనం చేయవచ్చు.
ఐఐటీ– గౌహతి :
ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఐఐటీ గౌహతి.. అండర్ గ్రాడ్యుయేషన్‌లో రెండు కొత్త కోర్సులను ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడి బయో సైన్సెస్ అండ్ బయో ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో.. బీటెక్ చివరి సంవత్సరం, ఎంటెక్, పీహెచ్‌డీ విద్యార్థులకు ఎలక్టివ్ కోర్సుగా కరోనావైరస్, మాలిక్యులర్ వైరాలజీని బోధిస్తోంది.
ఐఐటీ – హైదరాబాద్ :
తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఐఐటీ ఇది. ఈ ఇన్‌స్టిట్యూట్ 2020లో కొత్తగా ‘బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్’ కోర్సును ప్రవేశపెట్టింది.
ఐఐటీ–తిరుపతి :
తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటైన మరో ఐఐటీ ఇది. ఇందులో 2019–20 విద్యా సంవత్సరం నుంచి డిపార్ట్‌మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగం ఆధ్వర్యంలో ఎంఎస్సీ మ్యాథ్స్ అండ్ ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్‌ను అందిస్తున్నారు. కాగా ఈ విద్యా సంవత్సరం(2020–21) నుంచి కొత్తగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్‌ను సైతం ఏర్పాటు చేశారు. ఇందులో ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఫిజిక్స్ కోర్సులను అందించేందుకు ఏర్పాటు చేశారు.

- అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో బీటెక్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌ను కూడా కొత్తగా ప్రారంభించింది. ప్రస్తుతం 40 సీట్లు అందుబాటులో ఉంచింది.
- ఈ విద్యా సంత్సరం(2020–21) నుంచి బీటెక్ ఇంజనీరింగ్ అండ్ కంప్యుటేషనల్ మెకానిక్స్ కోర్సును సైతం అందిస్తోంది.
- ఈ కోర్సుల్లో ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకు సాధించినవారు చేరవచ్చు.
ఐఐటీ మద్రాస్ :
దేశంలో టాప్ ఇన్‌స్టిట్యూట్‌గా కొనసాగుతున్న ఐఐటీ మద్రాస్.. బీటెక్‌లో ‘బయోమిమిక్రీ’ కోర్సును ప్రారంభించింది. ఇది ఫుల్ సెమిస్టర్ కోర్సు. బయోమిమిక్రీ అనేది బయాలజీ, ఇంజనీరింగ్ కలయికతో ఏర్పాడిన కోర్సు. దీనిద్వారా ప్రకృతిలోని క్లిష్టమైన సమస్యలు పరిష్కరించే అవకాశం ఏర్పడుతుంది. బయో మిమిక్రీ నేర్చుకోవడానికి మీరు జీవశాస్త్రవేత్త లేదా ఇంజనీర్ కానవసరం లేదు. నేర్చుకోవాలన్న తపన ఉన్నవారు ఈ కోర్సులో చేరి..ప్రకృతిలోని ప్రాణి పుట్టుక, జీవన విధానంపై అధ్యయనం చేయవచ్చు.
- ఐఐటీ మద్రాస్ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆన్‌లైన్ విధానంలో బీఎస్సీ డేటా సైన్స్ ప్రోగ్రామ్ ను ప్రవేశపెట్టింది. వయసు, ప్రదేశంతో సంబం ధం లేకుండా ఎవరైనా ఈ కోర్సులో చేరవచ్చు.
ఐఐటీ– గౌహతి :
ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఐఐటీ గౌహతి.. అండర్ గ్రాడ్యుయేషన్‌లో రెండు కొత్త కోర్సులను ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడి బయో సైన్సెస్ అండ్ బయో ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో.. బీటెక్ చివరి సంవత్సరం, ఎంటెక్, పీహెచ్‌డీ విద్యార్థులకు ఎలక్టివ్ కోర్సుగా కరోనావైరస్, మాలిక్యులర్ వైరాలజీని బోధిస్తోంది.
- ఈ ఐఐటీ గత విద్యా సంవత్సరం(2019–20)లో ఎంటెక్ డేటాసైన్స్‌తోపాటు ఇంటర్నేషనల్ జాయింట్ పోస్టు గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఇన్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ జాయింట్ పీహెచ్‌డీ ఇన్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాల జీ, ఇంటర్నేషనల్ జాయింట్ పీహెచ్‌డీ ఇన్ ఇంటిగ్రేటెడ్ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. ఈ కోర్సులను జపాన్‌లోని గిఫు యూనివర్సిటీ, ఐఐటీ గౌహతి సంయుక్తంగా అందిస్తున్నాయి. అంతర్జాతీయ యూనివర్సిటీతో కలిసి కోర్సులు అందిస్తున్న మొట్టమొదటి ఐఐటీ ఇదే. కోర్సులో భాగంగా జపాన్ విద్యార్థులు ఐఐటీ గౌహతిలోను, ఇక్కడి విద్యార్థులు గిఫు వర్సిటీలోను చదువుతారు.
ఐఐటీ – హైదరాబాద్ :
తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఐఐటీ ఇది. ఈ ఇన్‌స్టిట్యూట్ 2020లో కొత్తగా ‘బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్’ కోర్సును ప్రవేశపెట్టింది.
- వైద్య ఆరోగ్య రంగంలో ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఎంతో డిమాండ్ ఉంది. మెడికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ సిస్టమ్స్ బయాలజీ వంటి కీలక విభాగాలతోపాటు, హెల్త్‌కేర్ డేటా అనలిటిక్స్, 3డీ బయో ప్రింటింగ్, మెడికల్ ఆప్టిక్స్ అండ్ ఇమేజింగ్, నానోమెడిసిన్, న్యూరోటెక్నాలజీ, బయోమెకానిక్స్, న్యూరోమార్ఫిక్ ఇంజనీరింగ్, మెడికల్ డేటా మోడలింగ్ అండ్ సిమ్యులేషన్ విభాగాల్లో ఈ కోర్సు అవసరం ఎంతో ఉంది.
ఐఐటీ–తిరుపతి :
తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటైన మరో ఐఐటీ ఇది. ఇందులో 2019–20 విద్యా సంవత్సరం నుంచి డిపార్ట్‌మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగం ఆధ్వర్యంలో ఎంఎస్సీ మ్యాథ్స్ అండ్ ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్‌ను అందిస్తున్నారు. కాగా ఈ విద్యా సంవత్సరం(2020–21) నుంచి కొత్తగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్‌ను సైతం ఏర్పాటు చేశారు. ఇందులో ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఫిజిక్స్ కోర్సులను అందించేందుకు ఏర్పాటు చేశారు.
- ఐఐటీలు అందించే ఎంఎస్సీ కోర్సుల్లో చేరాలం టే.. విద్యార్థులు ‘జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎమ్మెస్సీ’ లేదా గేట్‌లో ఉత్తమ స్కోర్ పొందాలి.
Published date : 06 Nov 2020 03:32PM