Skip to main content

ఐఐపీఎస్‌ సీటు సాధిస్తే.. నెలకు రూ.31 వేల వరకు స్టయిపెండ్‌..

ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పాపులేషన్‌ సైన్సెస్‌ (ఐఐపీఎస్‌) అందించే ఆయా కోర్సుల్లో ఎంఏ/ ఎంఎస్సీ, ఎంబీడీ కోర్సులకు ఆన్‌లైన్‌ ఎంట్రన్స్‌ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
అలాగే ఎంపీఎస్‌ కోర్సుకు ఆన్‌లైన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌తో పాటు పర్సనల్‌ ఇంటర్వూ్య నిర్వహిస్తారు. అదే ఫుల్‌ టైమ్‌ పీహెచ్‌డీ ప్రవేశాలకు ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్షతోపాటు ప్రపోజల్‌ రైటింగ్, పర్సనల్‌ ఇంటర్వూ్య ఉంటుంది. ఇక పార్ట్‌టైమ్‌ పీహెచ్‌డీ ప్రవేశాల కోసం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌లైన్‌ పరీక్షను నిర్వహిస్తుంది, ఇందులో ప్రతిభ చూపినవారికి పర్సనల్‌ ఇంటర్వూ్య ఉంటుంది. పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌కు అభ్యర్థి పరిశోధన ప్రపోజల్, పర్సనల్‌ ఇంటర్వూ్య ఆధారంగా ఎంపిక చేస్తారు.

స్టయిపండ్‌
..
  • ఐఐపీఎస్‌ అందిస్తున్న ఎంఏ/ఎమ్మెస్సీ/ ఎంపీఎస్‌ కోర్సుల్లో చేరిన అభ్యర్థులకు నెలకు రూ.5వేల చొప్పున స్టయిపండ్‌ అందిస్తారు.
  • పీహెచ్‌డీ అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం– నెట్‌ అర్హత పొందిన వారికి మొదటి రెండేళ్లు నెలకు రూ.31వేలు, తర్వాత రెండేళ్లు నెలకు రూ.35వేల చొప్పున ఫెలోషిప్‌ అందిస్తారు. దీంతోపాటు మొదటి రెండేళ్లు సంవత్సరానికి రూ.10వేల చొప్పున, మూడో ఏడాది రూ.20,500 కాంటింజెంట్‌ గ్రాంట్‌ చెల్లిస్తారు.
  • నెట్‌ లేనివారికి మొదటి రెండేళ్లు నెలకు రూ.12 వేలు, తర్వాత రెండేళ్లు నెలకు రూ.14 వేల చొప్పున ఇస్తారు. దీంతోపాటు మరో రూ.10వేలు అత్యవసర నిధిగా మంజూరు చేస్తారు. పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌ అభ్యర్థులకు నెలకు రూ.50 వేలు, హెచ్‌ఆర్‌ఏ ఏడాది కాలం పాటు చెల్లిస్తారు.
Published date : 13 Mar 2021 12:45PM

Photo Stories