ఐఐఎస్సీలో ‘రీసెర్చ్’ ప్రోగ్రామ్స్ లో ప్రవేశం పొందండిలా...
Sakshi Education
శాస్త్ర విద్య, పరిశోధనలకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) తలమానికంగా నిలుస్తోంది. అత్యుత్తమ ప్రమాణాలతో గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటుతున్న ఐఐఎస్సీ.. వినూత్న కోర్సులు అందిస్తూ ముందుకుసాగుతోంది. తాజాగా ఐఐఎస్సీ రీసెర్చ్(పీహెచ్‌డీ) ప్రోగ్రామ్, పీహెచ్‌డీ ఎక్స్‌టర్నల్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. నోటిఫికేషన్ సమాచారంతోపాటు ఐఐఎస్సీ ప్రత్యేకతలు, అందిస్తున్న కోర్సుల వివరాలు...
ప్రవేశం కల్పిస్తున్న ప్రోగ్రామ్‌లు:
రీసెర్చ్(పీహెచ్‌డీ) ప్రోగ్రామ్‌లు, పీహెచ్‌డీ- ఎక్సటర్నల్ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్.
డిపార్ట్‌మెంట్‌లు:
అర్హతలు:
ముఖ్యతేదీలు :
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: అక్టోబరు 31, 2019
ఇంటర్వ్యూ తేదీలు: నవంబర్ 18,19
సెషన్ ప్రారంభం: జనవరి 1, 2020.
ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అభ్యర్థులకు రూ.400. పీహెచ్‌డీ-ఈఆర్‌పీ అభ్యర్థులకు రూ.2000.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: admissions.iisc.ac.in
హయ్యర్ ఎడ్యుకేషన్:
పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులు:
పీజీ, రీసెర్చ్ ప్రోగ్రామ్స్ :
ఐఐఎస్సీ ప్రస్థానం సాగిందిలా..
ఐఐఎస్సీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌ల్లో ఉన్నత విద్య, పరిశోధనల పరంగా భారత్‌లో అగ్రగామి ఇన్‌స్టిట్యూట్‌గా వెలుగొందుతోంది. దీన్ని 1909లో ఏర్పాటు చేశారు. దీనికి 1958లో డీమ్డ్ టు బి యూనివర్సిటీ, 2018లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ హోదా లభించింది.
సకల సౌకర్యాల క్యాంపస్..
కోర్సులు ఇవే..
బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(రీసెర్చ్) :
దేశ ప్రగతిలో గుణాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో ఐఐఎస్సీ 2011లో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ సైన్సు(రీసెర్చ్) ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. కోర్ సైన్సు అంశాలు, ఇంటర్ డిసిప్లినరీ టాపిక్స్‌ను సమపాళ్లలో చేర్చి.. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కోర్సు కరిక్యులాన్ని రూపొందించారు. దీంతో ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు అకడమిక్, పరిశ్రమల పరంగా పెద్దఎత్తున అవకాశాలు దక్కుతున్నాయి. ఈ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు ఐఐఎస్సీ ఉన్నత విద్య పరంగా మాస్టర్ ఆఫ్ సైన్సు ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పిస్తుంది. ఈ విధానంలో విద్యార్థులు ఐదో సంవత్సరం ఐఐఎస్సీలో చదివి ఎంఎస్సీ డిగ్రీ పట్టా అందుకోవచ్చు.
అర్హతలు..
మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలకు అదనంగా బయాలజీ, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్సు సబ్జెక్టులను చదవిన వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు అర్హత పరీక్షలో ప్రథమ శ్రేణి లేదా 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల అభ్యర్థులు ఉత్తీర్ణులైతే సరిపోతుంది. ఈ కోర్సుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్య జరుగుతుంది.
రీసెర్చ్(పీహెచ్‌డీ) ప్రోగ్రామ్‌లు, పీహెచ్‌డీ- ఎక్సటర్నల్ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్.
డిపార్ట్‌మెంట్‌లు:
- ఏరోస్పేస్, కెమికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఆటోమేషన్, కంప్యుటేషనల్ అండ్ డేటాసైన్స్, ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ అప్లయిడ్ ఫిజిక్స్, ఇనార్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ, మెటీరియల్స్, మెటీరియల్స్ రీసెర్చ్, మెకానికల్ ఇంజనీరింగ్.
- ఇంటర్ డిసిప్లినరీ ప్రోగ్రామ్: బయోసిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్.
అర్హతలు:
- ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీల్లో నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ/సైన్స్, ఎకనామిక్స్, జాగ్రఫీ, సోషల్ వర్క్, సైకాలజీ, మేనేజ్‌మెంట్, కామర్స్, ఆపరేషన్స్ రీసెర్చ్, కంప్యూటర్‌సైన్స్/ అప్లికేషన్స్‌లో మాస్టర్ డిగ్రీ/ ఇంజనీరింగ్/ ఆర్కిటెక్చర్/ఫార్మసీ/ వెటర్నరీ సెన్సైస్‌లో మాస్టర్ డిగ్రీ/ కేంద్ర నిధులతో నడిచే టెక్నలాజికల్ ఇన్‌స్టిట్యూట్స్ నుంచి 8.5 సీజీపీఏతో బ్యాచిలర్ డిగ్రీ(లేదా) ఇంజనీరింగ్, టెక్నాలజీల్లో డిగ్రీకి తత్సమానం/ ఎంబీబీఎస్/ ఎండీ/ యూపీఎస్‌సీ (లేదా) ఏఐసీటీఈ గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీతోపాటు వ్యాలిడ్ గేట్ స్కోరు/ నెట్ జేఆర్‌ఎఫ్ ఉండాలి. బీఫార్మసీ అభ్యర్థులకు వ్యాలిడ్ జీప్యాట్ స్కోరు/ నెట్ జేఆర్‌ఎఫ్ ఉండాలి.
- ఇంజనీరింగ్, టెక్నాలజీల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు జనవరి 1, 2020 నాటికి వ్యాలిడ్ గేట్ స్కోరు ఉండాలి.
- నెట్ జేఆర్‌ఎఫ్: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్, యూజీసీ-నెట్, డీబీటీ జేఆర్‌ఎఫ్, ఐఐఈఎంఆర్ జేఆర్‌ఎఫ్, జెస్ట్, ఎన్‌బీహెచ్‌ఎమ్ స్ట్రీనింగ్ టెస్టు 2019, ఇన్‌స్పైర్.
ముఖ్యతేదీలు :
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: అక్టోబరు 31, 2019
ఇంటర్వ్యూ తేదీలు: నవంబర్ 18,19
సెషన్ ప్రారంభం: జనవరి 1, 2020.
ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అభ్యర్థులకు రూ.400. పీహెచ్‌డీ-ఈఆర్‌పీ అభ్యర్థులకు రూ.2000.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: admissions.iisc.ac.in
హయ్యర్ ఎడ్యుకేషన్:
పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులు:
- మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ(ఎంటెక్)
- మాస్టర్ ఆఫ్ డిజైన్
- మాస్టర్ ఆఫ్ మేనేజ్‌మెంట్
- ఎంటెక్(స్పాన్సర్డ్)
- బీటెక్/బీఈ ఉత్తీర్ణతతోపాటు వ్యాలిడ్ గేట్ స్కోరు ఉన్న అభ్యర్థులు ఎంటెక్‌లో ప్రవేశాలకు అర్హులు. బీఈ/బీటెక్/బీడీఈఎస్/బీఆర్క్ ఉత్తీర్ణత,వ్యాలిడ్ గేట్, సీడ్ స్కోరు కలిగిన అభ్యర్థులు మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పీజీ, రీసెర్చ్ ప్రోగ్రామ్స్ :
- ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ :
అర్హత: జామ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. - జామ్‌లో మ్యాథ్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ పేపర్‌లో క్వాలిఫై అయిన బీఈ/బీటెక్ అభ్యర్థులు మ్యాథమెటికల్ సైన్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
- జామ్‌లో బయోటెక్నాలజీ పేపర్‌లో క్వాలిఫై అయిన బీఈ/బీటెక్ అభ్యర్థులు బయోలాజికల్ సైన్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
- జెస్ట్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఫిజికల్ సైన్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఐఐఎస్సీ ప్రస్థానం సాగిందిలా..
ఐఐఎస్సీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌ల్లో ఉన్నత విద్య, పరిశోధనల పరంగా భారత్‌లో అగ్రగామి ఇన్‌స్టిట్యూట్‌గా వెలుగొందుతోంది. దీన్ని 1909లో ఏర్పాటు చేశారు. దీనికి 1958లో డీమ్డ్ టు బి యూనివర్సిటీ, 2018లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ హోదా లభించింది.
సకల సౌకర్యాల క్యాంపస్..
- అత్యుత్తమ సౌకర్యాలతో విద్యార్థినీ విద్యార్థులకు వేర్వేరుగా హాస్టల్ వసతి.
- క్యాంపస్‌లోని జింఖానా గ్రౌండ్‌లో జరిగే కల్చరల్, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో పాలుపంచుకొనే అవకాశం.
- హెల్త్ సెంటర్ ద్వారా విద్యార్థులు, ఫ్యాకల్టీ, బోధనేతర సిబ్బందికి ఆరోగ్య సేవలు.
- సూపర్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ద్వారా కంప్యూటేషనల్ సేవలు.
- జేఆర్‌డీ టాటా మెమోరియల్ లైబ్రరీలో ఐదు లక్షల వాల్యుమ్‌ల పుస్తకాలు, పిరియాడికల్స్, మ్యాగజీన్‌ల లభ్యత.
- ప్రముఖ కంపెనీలు క్యాంపస్‌కు వచ్చి నియామకాలు చేపడుతున్నాయి. విద్యార్థులకు సహకరిస్తున్న క్యాంపస్ ప్లేస్‌మెంట్ సెంటర్.
కోర్సులు ఇవే..
- అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్
- పోస్టుగ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్
- ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్
- పీహెచ్‌డీ ప్రోగ్రామ్
బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(రీసెర్చ్) :
దేశ ప్రగతిలో గుణాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో ఐఐఎస్సీ 2011లో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ సైన్సు(రీసెర్చ్) ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. కోర్ సైన్సు అంశాలు, ఇంటర్ డిసిప్లినరీ టాపిక్స్‌ను సమపాళ్లలో చేర్చి.. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కోర్సు కరిక్యులాన్ని రూపొందించారు. దీంతో ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు అకడమిక్, పరిశ్రమల పరంగా పెద్దఎత్తున అవకాశాలు దక్కుతున్నాయి. ఈ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు ఐఐఎస్సీ ఉన్నత విద్య పరంగా మాస్టర్ ఆఫ్ సైన్సు ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పిస్తుంది. ఈ విధానంలో విద్యార్థులు ఐదో సంవత్సరం ఐఐఎస్సీలో చదివి ఎంఎస్సీ డిగ్రీ పట్టా అందుకోవచ్చు.
అర్హతలు..
మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలకు అదనంగా బయాలజీ, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్సు సబ్జెక్టులను చదవిన వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు అర్హత పరీక్షలో ప్రథమ శ్రేణి లేదా 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల అభ్యర్థులు ఉత్తీర్ణులైతే సరిపోతుంది. ఈ కోర్సుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్య జరుగుతుంది.
Published date : 26 Oct 2019 05:04PM