Budget 2023: బడ్జెట్ 2023లోని కొత్త పథకాలు ఇవే..
ఈ బడ్జెట్‌లో కేంద్రం పలు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది.
బడ్జెట్లోని కొత్త పథకాలు ఇవే..
☛ దేఖో ఆప్నా దేశ్ పథకం
☛ ఫార్మరంగ అభివ`ద్ధి ప్రత్యేక పథకం
☛ మేకిన్ ఇండియా, మేక్ ఏ వర్క్ మిషన్ ప్రారంభం
☛ మహిళలు, బాలికల కోసం సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం
☛ మహిళల కోసం అధిక వడ్డీతో ప్రత్యేక పొదుపు పథకం
☛ దళితుల అభివ`ద్ధికి ప్రత్యేక పథకం
Union Budget 2023: బడ్జెట్ 2023తో.. ధరలు తగ్గేవి.. పెరిగేవి ఏంటో తెలుసా..?
మహిళలు, వృద్ధులకు ప్రాధాన్యత..
బడ్జెట్‌లో మహిళలకు, వృద్ధులకు కేంద్రం ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది. మహిళల కోసం ప్రత్యేకంగా ఓ పథకాన్ని తీసుకొచ్చింది. అలాగే, సీనియర్ సిటిజన్లు డిపాజిట్ చేసే గరిష్ఠ పరిమితిని రూ.30 లక్షలకు పెంచింది. మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. రెండేళ్ల కాలానికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంలో డిపాజిట్‌పై 7.5 శాతం స్థిర వడ్డీ ఉంటుంది. గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఈ పథకంలో డిపాజిట్ చేయొచ్చు. పాక్షిక మినహాయింపులకు అవకాశం ఉంటుంది.
సీనియర్ సిటిజన్లకు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కింద ప్రస్తుతం గరిష్ఠ పరిమితి రూ.15 లక్షల వరకు మాత్రమే ఉంది. దీన్ని రూ.30 లక్షలకు వరకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ పరిమితిని సైతం కేంద్రం సవరించింది. ఇప్పుడున్న 4.5 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచారు. జాయింట్ అకౌంట్ కలిగిన వారికి ప్రస్తుతం ఉన్న రూ.9 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచారు. ఈ పథకంపై ప్రస్తుతం 7.10% వడ్డీ లభిస్తుంది.