Skip to main content

సుస్థిర కెరీర్‌కు కేరాఫ్...స్పెషలిస్టు ఆఫీసర్ కొలువులు

బ్యాంకు ఉద్యోగాలు అనగానే వెంటనే గుర్తొచ్చేవి ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో), క్లర్క్ ఉద్యోగాలే! వీటితోపాటు ఆయా బ్యాంకులకు ప్రత్యేక నైపుణ్యాలున్న మానవ వనరుల అవసరం చాలా ఉంటుంది. ఈ నిపుణులను స్పెషలిస్టు ఆఫీసర్లు అని పిలుస్తారు. ప్రభుత్వ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఐబీపీఎస్ ద్వారా; ప్రైవేటు బ్యాంకులు ప్రత్యేక ప్రకటనల ద్వారా స్పెషలిస్టు ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఈ క్రమంలో స్పెషలిస్టు ఆఫీసర్ల అర్హతలు, విధులు, కెరీర్, వేతనాలు తదితర అంశాలపై ఫోకస్...
ఐటీ ఆఫీసర్ :
ముఖ్య విధులు:
  • కోర్ బ్యాంకింగ్ అప్లికేషన్స్‌ను పర్యవేక్షించడం, డేటా నిర్వహణ, ప్రొసీజరల్ డాక్యుమెంటేషన్, ఇతర ఫైల్స్ బాధ్యత.
  • నెట్‌వర్క్ సెక్యూరిటీ, యాంటివైరస్ అప్‌డేట్లు, కంప్యూటర్ల పనితీరు పర్యవేక్షణ, యాంటీ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్; సర్వర్స్, డేటాబేస్ పర్యవేక్షణ; కొత్త టెక్నాలజీకి మారడం తదితర బ్యాంకింగ్ కార్యకలా పాలకు అవసరమైన టెక్నాలజీ సంబంధిత విధుల నిర్వహణ. ఏటీఎంలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, నెట్‌వర్కింగ్ తదితరాల పర్యవేక్షణ.
అర్హతలు: కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్‌‌స/ఐటీ/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్‌‌స/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రు మెంటేషన్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా పీజీ. (లేదా) డీవోఈఏసీసీ-బి లెవల్ డిగ్రీ ఉత్తీర్ణత. పని అనుభవం తప్పనిసరి. వీరికి కూడా పీవో/అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రేణిలో వేతనాలు ఉంటాయి.

ముఖ్య విధులు...
  • ఉత్పత్తులు, సేవల ప్రమోషన్; మార్కె టింగ్ క్యాంపెయిన్ల నిర్వహణ.
  • బ్యాంకు సిబ్బందికి వివిధ అంశాలపై శిక్షణ తరగతుల నిర్వహణ. వర్క్‌షాపు లు కూడా నిర్వహించాల్సి ఉంటుంది.
  • సోషల్ మీడియా ద్వారా బ్యాంకింగ్ సేవలను ప్రమోట్ చేయాల్సిన బాధ్య త మార్కెటింగ్ ఆఫీసర్‌దే.
  • ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం బ్రోచర్ల తయారీ. ప్రకటన సంస్థలతో సమన్వయం.
అర్హతలు: డిగ్రీతోపాటు మార్కెటింగ్ స్పెషలై జేషన్‌తో ఫుల్‌టైమ్ ఎంఎంఎస్/ఎంబీఏ/పీజీడీబీఏ/పీజీడీబీఎం /పీజీపీఎం/పీజీడీఎం ఉత్తీర్ణత.

అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ :
ముఖ్య విధులు..
  • వ్యవసాయ రుణాలు మంజూరు చేయడం, అందుకోసం క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించడం.
  • రుణాల రికవరీకి చర్యలు తీసుకోవడం. బ్యాంకులు కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలపై రైతులకు అవగాహన కల్పించడం.
  • స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి, వాటికి రుణాలు అందేలా చూడటం. ప్రభుత్వ వ్యవసాయ బీమా పథకాలపై అవగాహన కల్పించడం.
    అర్హతలు :
  • అగ్రికల్చర్/హార్టికల్చర్/యానిమల్ హజ్బెండరీ/వెటర్నరీ సైన్‌‌స/డైరీసైన్స్/ఫిషరీ సైన్‌‌స/పిసీ కల్చర్/అగ్రి మార్కెటింగ్ అండ్ కోపరేషన్/కోపరేషన్ అండ్ బ్యాంకింగ్/ఆగ్రో ఫారెస్ట్రీ/అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ/ఫుడ్ సైన్‌‌స/ఫుడ్ టెక్నాలజీ/అగ్రికల్చరల్ బిజినెస్ మేనేజ్‌మెంట్/డెరుురీ టెక్నాలజీ/ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్/ఫారెస్ట్రీలో నాలుగేళ్ల డిగ్రీ (గ్రాడ్యుయేషన్).
  • స్థూల వేతనం సుమారుగా రూ.38 వేలకు పైగా ఉంటుంది. బ్యాంకు, పనిచేసే ప్రాంతం ఆధారంగా అలవెన్సులుంటాయి.

లా ఆఫీసర్ :
ముఖ్య విధులు..
  • ఆర్‌బీఐ నిబంధనలకు లోబడి బ్యాంకు కార్యకలాపాలు జరిగేలా చూడటం.
  • లీగల్ డాక్యుమెంట్లను రూపొందించడం. రుణాల ఎగవేతదారులపై కేసులు ఫైల్ చేయించాల్సిన బాధ్యత లా ఆఫీసర్లదే.
  • అవసరమైనప్పుడు బ్యాంకుకు లీగల్ కౌన్సిల్‌గా వ్యవహరించడం.
  • బ్యాంకు సిబ్బందికి ప్రాథమిక చట్టాల గురించి వివరించడం.
అర్హత: లా డిగ్రీతోపాటు బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకొని ఉండాలి.


హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్ :
ముఖ్య విధులు...
ఉద్యోగుల బదిలీలు, పోస్టింగుల వ్యవహారాలు. బ్యాంకింగ్ ట్రెండ్స్‌పై ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాల నిర్వహణ. ఉద్యోగులకు జీతభత్యాలు, ఇతర సౌకర్యాలకు సంబంధించిన కార్యకలాపాలు. సిబ్బంది పనితీరు మదింపు.
అర్హతలు:డిగ్రీతోపాటు పర్సనల్ మేనేజ్‌మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్‌‌స/హెచ్‌ఆర్/హెచ్‌ఆర్‌డీ/సోషల్ వర్క్/లేబర్ లా సబ్జెక్టులో పీజీ డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత.

అర్హతలు.. పరీక్ష స్వరూపం.. కెరీర్
వయసు :
స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టులకు సాధారణంగా 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.

పరీక్ష స్వరూపం..
ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ (బ్యాంకింగ్ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం) సబ్జెక్టులతో పాటు ప్రొఫెషనల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి.

కెరీర్-వేతనాలు :
స్పెషలిస్టు ఆఫీసర్ ఉద్యోగాలు జూనియర్, మిడిల్, సీనియర్ మేనేజ్‌మెంట్ స్థారుులో ఉంటారుు. ఉద్యోగ ప్రకటనల ద్వారా జూనియర్, మిడిల్ మేనేజ్‌మెంట్ కేడర్ పోస్టులను భర్తీ చేస్తారు. వ్యవసాయ సంబంధ ప్రత్యేక శాఖల్లో అగ్రికల్చర్ ఆఫీసర్లు, పెద్ద బ్రాంచ్‌లలో మార్కెటింగ్ ఆఫీసర్లు ఉంటారు. ఇతర స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టులు రీజనల్, జోనల్ ఆఫీస్, హెడ్ ఆఫీస్‌లకు మాత్రమే పరిమితం. పోటీ తక్కువగా ఉన్నందువల్ల త్వరగా పదోన్నతులు వచ్చే అవకాశం ఎక్కువ.

ప్రొఫెషనల్ కోర్సుల్లోని అంశాలపై పట్టు ఉంటే ఉద్యోగం సాధించడం తేలిక. దీంతోపాటు మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లిష్, బ్యాంకింగ్ అంశాలను చదవాల్సి ఉంటుంది. ప్రొఫెషనల్ సబ్జెక్టుకు ఎక్కువ వెయిటేజీ ఉంటుంది కాబట్టి అకడమిక్ స్థాయి పుస్తకాలను ఎక్కువగా రిఫర్ చేయడం మేలు. స్పెషలిస్టు ఆఫీసర్‌గా కెరీర్‌లోకి అడుగుపెట్టి, ప్రతిభ కనబర్చడం ద్వారా ఉన్నత స్థానాలు అందుకోవచ్చు.
- మౌనిక తుంగపల్లి, అగ్రికల్చర్ ఆఫీసర్, కెనరా బ్యాంకు, చిట్యాల (ఐబీపీఎస్ ఎస్‌వో-2016, విజేత).
Published date : 25 Dec 2017 05:13PM

Photo Stories