Skip to main content

ఒకే ప్రిపరేషన్‌తో ఐబీపీఎస్, ఎస్‌బీఐ ఉద్యోగాలు కొట్టండిలా..

ఐబీపీఎస్ నోటిఫికేషన్లలో పీఓ, ఆర్‌ఆర్‌బీ, స్పెషలిస్ట్ ఆఫీసర్ల నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు.. ప్రిలిమ్స్ పరీక్షలన్నీ ఆర్‌ఆర్‌బీ మినహా ఒకే తరహాలో ఉంటాయని గమనించాలి.
కాబట్టి ఎస్‌బీఐ పీఓ, ఐబీపీఎస్ పీఓ, ఎస్‌ఓ, ఆర్‌ఆర్‌బీ పీఓ, క్లర్క్ ప్రిలిమినరీ పరీక్షలన్నింటికీ ఒకే సన్నద్ధత సరిపోతుంది. ఆర్‌ఆర్‌బీ నుంచి ఎస్‌బీఐ పీఓ ప్రిలిమ్స్ వరకూ.. ప్రశ్నల స్థాయి కొంత పెరుగుతుంది. కానీ సిలబస్‌లో పెద్దగా మార్పు ఉండదు. ఐబీపీఎస్ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు అదే ప్రిపరేషన్ ఎస్‌బీఐ పీఓ పరీక్షక్కూడా కొనసాగించాలి. ఆయా పరీక్షల గత ప్రశ్నపత్రాలను పరిశీలించి.. ప్రశ్నల స్థాయి పరంగా ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాలి. క్లిష్టంగా ఉండే ఎస్‌బీఐ పీఓ పరీక్షకు సిద్ధమైతే.. ఇతర పరీక్షలకూ సన్నద్ధమైనట్టేనని తెలుసుకోవాలి. ఎస్‌బీఐ పీఓ, ఐబీపీఎస్ పీఓ మెయిన్ పరీక్షలు ఒకేలా ఉన్నందున ఈ రెండిటికీ ఒకే సన్నద్ధత సరిపోతుంది.

మెయిన్‌పై ఫోకస్..
ప్రిలిమినరీలో ఉన్న 3 విభాగాలు మెయిన్‌లోనూ ఉన్నాయి. ప్రిలిమ్స్‌లో ఉన్న క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మెయిన్‌లోని డేటా ఇంటర్‌ప్రెటేషన్ ఒకే విభాగానికి చెందినవి. కాబట్టి మెయిన్‌కు తయారైతే ప్రిలిమ్స్ సన్నద్ధత కూడా పూర్తవుతుంది.

ఇంకా చదవండి: part 4: ఎస్‌బీఐ పీవో ఎగ్జామ్‌ సిలబస్, పరీక్ష విధానం ఇలా..
Published date : 24 Nov 2020 03:27PM

Photo Stories