Skip to main content

ఎస్‌బీఐలో 2000 పీవో ఉద్యోగాలు.. అర్హత, ఎంపిక ప్రక్రియ ఇలా!

భారత్‌లో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)2000 ప్రొబేషనరీ ఆఫీసర్(పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పీవోగా ఎంపికైతే రెండేళ్లు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. దాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్-1 సర్వీస్ ఖరారవుతుంది. బ్యాంకు కొలువుల అభ్యర్థులకు ఉపయోగపడేలా ఎస్‌బీఐ పీవో పోస్టుల వివరాలు, అర్హతలు, పరీక్ష విధానం, ప్రిపరేషన్‌పై ప్రత్యేక కథనం...

2వేల పోస్టులు..
పీవో పోస్టులు: 2000 (ఎస్సీ: 300, ఎస్టీ: 150, ఓబీసీ: 540, ఈడబ్ల్యూఎస్: 200, జనరల్: 810)

విద్యార్హత..
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం ఫైనల్ పరీక్షలు పూర్తవ్వని/ఫలితాలు వెలువడని అభ్యర్థులు సైతం ఎస్‌బీఐ పీవో పరీక్షలకు హాజరవ్వొచ్చు. అలాంటి అభ్యర్థులంతా 2020, డిసెంబరు 31 నాటికి డిగ్రీ ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది.

వయసు..
వయసు 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ(నాన్ క్రీమిలేయర్)లకు మూడేళ్ల వయోసడలింపు లభిస్తుంది.

వేతనం..
ఎస్‌బీఐ పీవో బేసిక్ పే రూ.27,620. దీంతోపాటు డియర్‌నెస్ అలవెన్స్(డీఏ), సిటీ కాంపన్సేటరీ అలవెన్స్(సీసీఏ), లీజ్డ్ హౌజ్ అలవెన్స్(ఎల్‌హెచ్‌ఏ), ఫర్నిచర్ అలవెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్(టీఏ) ఇతరత్రాలన్నీ కలిపి వార్షిక వేతనంగా రూ.7.5లక్షల నుంచి రూ.12.9 లక్షల మధ్య లభిస్తుంది. అంతేకాకుండా తక్కువ వడ్డీతో రుణ సదుపాయం అందుకునే అవకాశం కూడా ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ..
ఎస్‌బీఐ పీవో పోస్టులకు నియామక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో ఆబ్జెక్టివ్ తరహాలో ఆన్‌లైన్‌లో నిర్వహించే ప్రిలిమినరీ పరీక్ష, రెండో దశలో ఆబ్జెక్టివ్ తరహాలోని ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష, డిస్క్రిప్రివ్ టెస్ట్; మూడో దశలో గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ లేదా ఇంటర్వ్యూ మాత్రమే ఉంటాయి. మొదటి దశ నుంచి పోస్టుల సంఖ్యకు 10 రెట్ల మందిని రెండో దశకు ఎంపికచేస్తారు. రెండో దశ నుంచి పోస్టుల సంఖ్యకు మూడు రెట్ల మందిని ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల్లో అన్ని సెక్షన్‌ల సరాసరి మార్కులను ప్రాతిపదికగా తీసుకుంటారు. సెక్షన్‌ల వారీగా కటాఫ్ మార్కులు లేవు. ఇది అభ్యర్థులకు లాభించే అంశంగా చెప్పొచ్చు.

ఇంకా చదవండి: part 2: తక్కువ సమయంలో ప్రిపరేషన్‌తో.. ఎస్‌బీఐలో పీవో ఉద్యోగాలు సాధించండిలా..
Published date : 24 Nov 2020 03:36PM

Photo Stories