Skip to main content

అప్‌కమింగ్ కెరీర్...ఫిన్‌టెక్

ఫిన్‌టెక్ పూర్తి పేరు.. ఫైనాన్షియల్ టెక్నాలజీ. ఆర్థిక రంగంలో అమలు చేస్తున్న సంప్రదాయ పద్ధతుల స్థానంలో సరికొత్త అప్లికేషన్లను రూపొందించి అమల్లోకి తేవడం దీని ఉద్దేశం.
ఫిన్‌టెక్ అంటే..?
ఫిన్‌టెక్.. సాంకేతికతకు పెద్దపీట వేస్తూ ఎలాంటి చొరబాట్లకు తావు లేకుండా ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దడమే దీని లక్ష్యం. బ్యాంకింగ్, ఫైనాన్స్ అవసరాలను తీర్చడంతోపాటు విసృ్తత ఉద్యోగ అవకాశాలకు వేదిక నిలుస్తోంది.. ఫిన్‌టెక్. దాంతో ఫ్రెండ్లీ బ్యాంకర్, టెకీలకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఇండియాలో సుమారు 72 ఫిన్‌టెక్ సంస్థలు ఆర్థిక వ్యవహారాలను నిర్వహిస్తున్నాయి. పర్సనల్ లోన్స్, ఇన్‌కంట్యాక్స్ రిటర్న్స్, కార్ లోన్స్, మార్ట్‌గేజ్ లోన్స్, ఈఎంఐ, హెల్త్ ఇన్సూరెన్స్, టికెట్ పర్చేస్ వంటి సేవలను ఫిన్‌టెక్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఇవన్నీ తాము అందించే సేవలను పర్యవేక్షించడం కోసం ఐటీ, ఫిన్‌టెక్ ఉద్యోగులను నియమించుకుంటున్నాయి.

ఇండియాలో ఫిన్‌టెక్ సంస్థలు...
పేటీఎం పేమెంట్ బ్యాంక్, పేయూ ఇండి యా, ఫ్రీ చార్జ్, క్విక్ వాలెట్, మొబిక్విక్, చిల్లర్, ఎస్‌బీఐ బడ్డీ, ఐసీఐసీఐ పాకెట్స్, క్యాపిటల్ ప్లోట్, ఫ్లెక్సిలోన్స్, వెరిటాస్ ఫైనాన్స్, ఎలక్ట్రానిక్ పేమెం ట్స్ అండ్ సర్వీసెస్, ఈజీ ట్యాప్ మొబైల్ సర్వీ సెస్, ఇడ్జ్ క్యాష్ కార్డ్, రాజోర్‌పే సాఫ్ట్‌వేర్, బిల్ డెస్క్, ఫండ్స్ ఇండియా, టారో వెల్త్, పాలసీ బజార్, ఈజీ పాలసీ, క్రెడిట్ మంత్రి, క్లియర్ ట్యాక్స్, ఎన్‌పీసీఐ, డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీస్, స్టార్టప్ సంస్థలు.

పని విభాగాలు :
  • అప్లికేషన్ డెవలప్‌మెంట్
  • బిజినెస్ అనాలసిస్
  • ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్
  • ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
  • టెక్నికల్ సపోర్ట్
విద్యార్హతలు : బీఈ, బీటెక్, ఎంసీఏ, బీఎస్సీ(కంప్యూటర్ సైన్స్), సీఏ, కామర్స్ కోర్సులు.

నైపుణ్యాలు..
1. బిజినెస్ స్కిల్స్
2. ఫైనాన్షియల్ స్కిల్స్
3. మార్కెటింగ్ స్కిల్స్
4. కమ్యూనికేషన్ స్కిల్స్
5. అనలైజింగ్ స్కిల్స్
6. అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్

ఫిన్‌టెక్ జాబ్ ప్రొఫైల్స్...
  • రిలేషిప్ మేనేజర్
  • క్రెడిట్ రిస్క్ మేనేజర్
  • కస్టమర్ సక్సెస్ కోచ్
  • ఫైనాన్షియల్ అడ్వైజర్
  • క్యూఏ ఇంజనీర్
  • ఈవెంట్ మేనేజర్
  • టెస్ట్ లీడ్
  • ట్రెజరీ మేనేజర్
  • ఫైనాన్షియల్ ప్లానింగ్ మేనేజర్
  • సీనియర్ మేనేజర్
  • ఎంటర్‌ప్రైజ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్
Published date : 15 Dec 2017 06:11PM

Photo Stories