HYD Book Fair: పుస్తకాలు కొనాలనుకుంటున్నారా.?... అయితే చలో బుక్ ఫెయిర్
ఈ నెల 22 నుంచి జనవరి ఒకటి వరకు 35వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమైంది. గతేడాది 260 స్టాళ్లను ఏర్పాటు చేసిన నిర్వాహకులు.. ఈ ఏడాది ఆ సంఖ్యను 320కి పెంచారు.
చదవండి: ఎనిమిదో తరగతికే పెళ్లి... ఇప్పుడు ఆ యువతి ఏం సాధించిందో తెలుసా....
నగరంలో నిజాంల కాలం నుంచే పుస్తకాలకు ఆదరణ ఉంది. అధికార భాష ఉర్దూతోపాటు తెలుగు, మరాఠీ, కన్నడ, హిందీ ఇంగ్లిష్ పుస్తకాలు చదివే ప్రజలు మొదటి నుంచీ ఇక్కడ ఉన్నారు. పాఠకుల అభిరుచికి తగిన విధంగానే పుస్తక ప్రచురణ సంస్థలు ఆవిర్భవించాయి. కోఠిలోని బడీచౌడీ పుస్తక బజార్‌గా వెలుగొందింది. అక్కడి పుస్తక విక్రేతలే హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు శ్రీకారం చుట్టారు.
చదవండి: పాలు, పెరుగు అమ్ముతూ కోట్లు సంపాదిస్తోన్న బామ...
దేశవ్యాప్తంగా పుస్తక పఠనాన్ని పెంచే లక్ష్యంతో ఆవిర్భవించిన నేషనల్ బుక్ ట్రస్ట్ నగరంలోని పుస్తక ప్రచురణ సంస్థలు, విక్రయ సంస్థలతో కలసి 1986లో ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ను తొలిసారి కేశవ మెమోరియల్ స్కూల్ మెదానంలో ఏర్పాటు చేసింది. ఆ తరువాత నిజాం కళాశాల మైదానం, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం, నెక్లెస్‌రోడ్ తదితర ప్రాంతాల్లో పుస్తక ప్రదర్శనలు జరిగాయి.
చదవండి: ‘పది’ పూర్తయి ఉంటేనే పేస్కేల్... వీఆర్‌ఏలకు ఇది శరాఘాతమే.?
కథలు, నవలలు, చరిత్ర గ్రంథాలదే పుస్తక ప్రదర్శనల తొలినాళ్లలో అగ్రస్థానం. సోవియెట్ సాహిత్యం కూడా పాఠకులను బాగా ప్రభావితం చేసింది. క్రమంగా ప్రముఖుల జీవిత చరిత్రలు, పంచతంత్ర వంటి పిల్లల పుస్తకాలు ఆదరణ పొందాయి. అలాగే యోగా, ఆయుర్వేద, హోమియో వైద్య పుస్తకాలు సైతం బాగా అమ్ముడవుతున్నాయి.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు విరివిగా వెలువడుతుండడంతో స్టడీ మెటీరియల్స్ కోసం అభ్యర్థులు ఎగబడుతున్నారు. తమకు కావాల్సిన బుక్ ఎక్కడ దొరుకుతుందో తెలియక ఇబ్బంది పడేవారికి బుక్ ఫెయిర్ ఒక వరంలాంటిదనే చెప్పాలి. ఇక్కడ ఏ పుస్తకం కావాలన్నా ఇట్లే దొరుకుతుంది. అన్ని రకాల పబ్లికేషన్లు ప్రచురించే పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం బుక్ ఫెయిర్‌కు వెళ్లి మీకు కావాల్సిన పుస్తకాన్ని హ్యాపీగా కొనేసేయండి.