వృత్తి బోధన- ప్రవృత్తి ఉచిత శిక్షణ
Sakshi Education
పగలల్లా తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తారు... సాయంత్రం వేళ, సెలవు దినాలలో ఖాళీ సమయంలో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉచిత శిక్షణ ఇస్తారు.. ప్రతిరోజు రెండు నుంచి మూడు గంటల పాటు ఇది ఉచిత సేవ.
ఆయన చేస్తున్న సేవ ఎందరో నిరుద్యోగులపాలిట వెలుగులవుతున్నాయి. ఆయనే పట్టణంలోని ఎల్‌ఐసీ కార్యాలయం పక్కనే ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రెబ్బు మురళీకృష్ణ మాస్టారు. బోధనపై మక్కువ..మురళీకృష్ణకు బోధన అంతే ఎంతో మక్కువ. తరగతిగదిలో విద్యార్థులకు పాఠాలు సులువుగా అర్ధమయ్యేలా బోధించడమే కాకుండా, సాయంత్రం వేళ పలు పోటీ పరీక్షలు రాసే నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణనిస్తూ ముందుకు సాగుతున్నారు. వృత్తి బోధన అయినప్పటికీ ప్రవృత్తి మాత్రం నిరుద్యోగలకు ఉచిత శిక్షణనివ్వడం. పాఠశాల సమయం ముగిశాక సాయంత్రం 4 గంటలనుంచి ఖాళీగా ఉండలేక గత రెండేళ్లుగా పోటీపరీక్షలు రాసే అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. దాదాపు ఏడాదిన్నర కాలంగా గ్రూపు -2, గ్రూపు-3 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులతో పాటు సచివాలయ ఉద్యోగాలకు, కానిస్టేబుల్ రాత పరీక్షలకు సంబంధించి ఉచితంగా శిక్షణ ఇచ్చారు. విజయవాడ వంటి నగరాలకు వెళ్లి శిక్షణ పొందాలంటే వేలాది రూపాయల ఫీజులు చెల్లించలేక ఇంటివద్దే ఉండి సిద్ధమయ్యే పేద వర్గాల అభ్యర్థులకు ఆయన ఇస్తున్న శిక్షణ ఎంతో ఉపయుక్తమవుతోంది.
19 మందికి సచివాలయ ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 1.30 లక్షల మందిని సచివాలయ ఉద్యోగులుగా నియమించింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తున్న నిరుద్యోగులకు నెలరోజుల పాటు మురళీకృష్ణ మాస్టారు ఉచిత శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణకు నూజివీడుతో పాటు గుడివాడ, కలూరు, హనుమాన్ జంక్షన్, విస్సన్నపేట, నందిగామ తదితర ప్రాంతాల నుంచి దాదాపు 100 మంది అభ్యర్థులు రాగా వారిలో 19 మందికి ఉద్యోగాలు లభించడం గమనార్హం.
ఎస్‌ఆర్‌ఆర్ హైస్కూల్ ఆవరణలో...
పట్టణంలోని ఎస్‌ఆర్‌ఆర్ హైస్కూల్ ఆవరణలో ఉన్న గ్రేడ్-1 శాఖ గ్రంథాలయం ఆవరణలో కొంతకాలం, ఆ తరువాత ఎస్‌ఆర్‌ఆర్ హైస్కూల్‌లో ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సచివాలయ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చారు. వీరికి సిలబస్‌లోని అంశాలేకాకుండా జనరల్ నాలెడ్జి, కరెంట్ అఫైర్స్ అంశాల గురించి విశదీకరిస్తూ బోధించారు. శిక్షణనిస్తూనే మరలా రెండురోజులకొకసారి అభ్యర్థులకు స్లిప్‌టెస్ట్‌లు నిర్వహిస్తూ అందుకు తగ్గట్టుగా శిక్షణ ఇస్తారు.
అభ్యర్థులకు అనుకూలమైన సమయాల్లోనే
కోచింగ్‌కు డబ్బులు చెల్లించలేక ఇంటివద్దనే ఉండి సిద్ధమయ్యే పేదవర్గాల అభ్యర్థులకు ఉపయోగపడాలనే లక్ష్యంతో ఉచితంగా శిక్షణ ఇస్తున్నా. గతంలో నేను గ్రూపు-2 పరీక్ష రాసిన నేపథ్యంలో ఆ అనుభవం వీరికి కోచింగ్ ఇవ్వడానికి ఎంతో ఉపయోగపడుతోంది. ఈ తరగతులు కూడా అభ్యర్థులకు అనుకూలమైన సమయాల్లోనే నిర్వహిస్తున్నా. నేను నిరుద్యోగిగా ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డా. అటువంటి పరిస్థితులు ఎవరికి రాకూడదని భావించి ఈ దిశగా ముందుకుసాగుతున్నా. నా వద్ద శిక్షణ పొంది ఆ తర్వాత ఉద్యోగాలు దక్కించుకున్నవారి కళ్లల్లో ఆనందం మరిచిపోలేను. - రెబ్బు మురళీకృష్ణ, టీచర్

Published date : 21 Oct 2019 03:22PM