‘ఉపకార’ దరఖాస్తు గడువు డిసెంబర్ 31 వరకుపొడిగింపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలకు దరఖాస్తు గడువును డిసెంబర్ 31 వరకు ప్రభుత్వం పొడిగించింది.
వాస్తవానికి అక్టోబర్ 31తో గడువు ముగిసినప్పటికీ విద్యార్థుల నుంచి అతి తక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో తప్పనిసరి పరిస్థితిలో దరఖాస్తు గడువును పెంచింది. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలకు సంబంధించిన ఈపాస్ వెబ్‌సైట్‌లో గడువు తేదీలను మార్పు చేశారు. 2019-20 విద్యా సంవత్సరంలో పోస్టుమెట్రిక్ కోర్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా 13.45 లక్షల మంది విద్యార్థులు ఉంటారని సంక్షేమ శాఖలు అంచనా వేశాయి. ఈక్రమంలో అక్టోబర్ 31 నాటికి కేవలం 7.39 లక్షల మంది మాత్రమే దరఖాస్తులు సమర్పించారు. గడువు ముగిసేనాటికి ఆశించిన వాటిలో సగం మంది మాత్రమే వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవడంతో గడువు తేదీని పెంచాలని కోరుతూ సంక్షేమ శాఖలు ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో డిసెంబర్ 31వరకు గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది.
రెండుసార్లు పొడిగించినా..
పోస్టుమెట్రిక్ ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ జూలై మొదటివారంలో ప్రారంభమైంది. సెప్టెంబర్ 30కల్లా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని భావించింది. ఈక్రమంలో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించినప్పటికీ... సెప్టెంబర్ చివరి నాటికి కేవలం 26శాతం విద్యార్థులు మాత్రమే నమోదు చేశారు. దీంతో సంక్షేమ శాఖలు గడువు పొడిగింపును కోరగా, అక్టోబర్ 31వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. కానీ నిర్దేశిత గడువు వరకు కేవలం 55శాతం మంది మాత్రమే నమోదు చేశారు. తాజాగా డిసెంబర్ 31వరకు గడువు పెంచిన ప్రభుత్వం... ఇకపై గడువు పొడిగింపు ఉండదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. గడువులోగా నమోదు చేసుకోని విద్యార్థులకు ఆ తర్వాత ఎట్టిపరిస్థితుల్లో అవకాశం కల్పించబోమని పేర్కొంది. అదేవిధంగా నమోదు ప్రక్రియలో సంక్షేమ శాఖ అధికారులు, కళాశాల యాజమాన్యాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించింది. కళాశాల యాజమాన్యాల ఉదాసీన వైఖరితో విద్యార్థులు నమోదులో జాప్యం చేస్తున్నట్లు అధికారులు సైతం పేర్కొంటున్నారు. ప్రతి కాలేజీ మూడు రోజులపాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తే ఈ ప్రక్రియ పూర్తవుతుందని గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

Published date : 05 Nov 2019 04:23PM