తుది తీర్పునకు లోబడే గ్రూప్-1 నియామకాలు: హైకోర్టు
Sakshi Education
సాక్షి, అమరావతి: గ్రూప్-1 పరీక్ష ఫలితాలు, ఆ తదుపరి చేపట్టే నియామకాలన్నీ తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది.
ఈ విషయాన్ని నియామకాల సందర్భంలో సంబంధిత అభ్యర్థులకు తెలియచేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులను ఆదేశించింది. నియామక పత్రాల్లో కూడా ఈ విషయాన్ని తెలియజేయాలంది. ఈ మేరకు సీజే జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
Published date : 29 Dec 2020 01:15PM