సహాయ గణాంకాధికారి,అసిస్టెంటు డెరైక్టర్ పోస్టులకు నోటిఫికేషన్లు
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఎకనమిక్స్, స్టాటిస్టికల్ విభాగంలోని సహాయ గణాంకాధికారి, గణాంక అసిస్టెంటు డెరైక్టర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జనవరి 23న నోటిఫికేషన్లు జారీ చేసింది.
సహాయ గణాంకాధికారుల పోస్టులు 78, అసిస్టెంటు డెరైక్టర్ పోస్టులు 6 భర్తీ చేయనున్నారు. సహాయ గణాంకాధికారుల పోస్టులకు ఫిబ్రవరి 12వ తేదీనుంచి మార్చి 6వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.అసిస్టెంటు డెరైక్టర్ పోస్టులకు జనవరి 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. వివరాలకు కమిషన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో పేర్కొంది.
జనవరి నెలాఖరులోగా ఇతర నోటిఫికేషన్లు..
ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ అధ్యక్షతన జనవరి 23న సమావేశం జరిగింది. ప్రభుత్వం ఆమోదించిన పోస్టుల్లో కొన్నిటికి ఇంకా నోటిఫికేషన్లు విడుదల చేయాల్సి ఉన్నందున వాటిని జనవరి నెలాఖరులోగా పూర్తిచేయాలని నిర్ణయించారు. దీంతో పాటు గ్రూప్1 పోస్టుల ప్రిలిమ్స్ పరీక్షలకు తక్కువ సమయం ఇచ్చారని, సిలబస్ ఎక్కువగా ఉన్నందున ఈ సమయం పెంచాలని అభ్యర్థుల నుంచి విన్నపాలు వస్తున్నందున దానిపైనా కమిషన్ చర్చించింది. దరఖాస్తుల సమర్పణ తుది గడువు ఇంకా ఉన్నందున మరోసారి దానిపై చర్చించి పరీక్షల తేదీల పొడిగింపు అంశాన్ని ప్రకటించాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు కమిషన్ వర్గాలు తెలిపాయి.

Published date : 24 Jan 2019 02:37PM