సెప్టెంబర్ 15, 16 తేదీల్లో డిగ్రీ లెక్చరర్ పరీక్షలు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులకు మెయిన్స్ పరీక్షలు ఈ నెల 15, 16వ తేదీల్లో జరుగుతాయని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కంప్యూటర్ ఆధారితంగా ఆబ్జెక్టివ్ తరహాలో ఈ పరీక్షలు జరుగుతాయని, అభ్యర్థులు హాల్‌టికెట్లను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
Published date : 09 Sep 2020 02:19PM