సచివాలయ ఉద్యోగానికి ఎంపికై న టీడీపీ మాజీ కౌన్సిలర్
Sakshi Education
మదనపల్లె (చిత్తూరు జిల్లా): ఆంధ్రప్రదేశ్ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగానికి చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన టీడీపీ మాజీ కౌన్సిలర్ ఝాన్సీ ఎంపికయ్యారు.
ఆర్వో ప్లాంట్ల ప్రారంభోత్సవంలో భాగంగా అక్టోబర్ 16న చిత్తూరు జిల్లా నక్కలదిన్నె చుక్కలతాండాకు వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్‌బాషాను ఝాన్సీరాణి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తనకు ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉందని, ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ చేర్చేందుకు తనవంతు కృషి చేస్తానని ఝాన్సీ తెలిపారు.
Published date : 17 Oct 2019 04:10PM