Skip to main content

సచివాలయ ఉద్యోగాల రాతపరీక్ష తేదీల్లో మార్పులపై 6న ప్రకటన

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే రాతపరీక్ష తేదీల్లో మార్పులు, చేర్పులపై ఆగస్టు 6న ఓ ప్రకటన చేయనున్నట్లు ద్వివేది వెల్లడించారు.
మొత్తం 19 రకాల ఉద్యోగాలను నాలుగు రకాలుగా వర్గీకరించి.. వాటికి సెప్టెంబరు 1, 8 తేదీలలో ఉదయం, సాయంత్రం రెండు పూటలా వేర్వేరుగా రాతపరీక్ష నిర్వహించనున్నారు. అయితే, ఉద్యోగాల వర్గీకరణలో కేటగిరి-2లో పేర్కొన్న గ్రూపు-ఏ, గ్రూపు-బీలో నాలుగు రకాల ఉద్యోగాలకు సెప్టెంబరు 1వ తేదీ సాయంత్రం రాతపరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ పరీక్షకు సివిల్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులకు అర్హత ఉండడంతో ఆయా పరీక్షలను ఒకే సమయంలో కాకుండా వేర్వేరుగా నిర్వహించాలని వారి నుంచి పెద్ద సంఖ్యలో వినతులు అధికారులకు చేరాయి. దీంతో పూర్తిస్థాయి రాతపరీక్ష షెడ్యూల్‌పై 6న స్పష్టత ఇవ్వనున్నట్టు ద్వివేది తెలిపారు.

సందేహాల నివృత్తికి సంప్రదించాల్సిన నెంబర్లు..
9121296051
9121296052
9121296053
9121296054
9121296055
Published date : 05 Aug 2019 05:10PM

Photo Stories