‘సచివాలయ’ పరీక్షలతో మాకు సంబంధం లేదు: ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నిర్వహించిన గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్షలతో ఏపీపీఎస్సీకి సంబంధం లేదని ఆ సంస్థ చైర్మన్ పి.ఉదయభాస్కర్ తెలిపారు.
సెప్టెంబర్ 23న కమిషన్ సమావేశానంతరం ఆయన కొన్ని టీవీ ఛానెళ్లతో మాట్లాడారు. తమది రాజ్యాంగ సంస్థ అని, ప్రభుత్వం అప్పగించే ఉద్యోగ ఖాళీల భర్తీకి పరీక్షలు నిర్వహించడం వరకే తమ బాధ్యతన్నారు. తమ పరిధిలోని అన్ని అంశాలు కాన్ఫిడెన్షియల్‌గా ఉంటాయని తెలిపారు. గ్రామ/వార్డు సచివాలయ పోస్టుల పరీక్షల నిర్వహణను ప్రభుత్వం తమకు అప్పగించలేదన్నారు. పరీక్ష పత్రాల లీకేజీ అయిందో లేదో తమకు తెలియదని స్పష్టం చేశారు.
Published date : 24 Sep 2019 02:11PM