Skip to main content

పరీక్ష కేంద్రాల ఎంపికకు సెప్టెంబర్ 10 వరకు గడువు

సాక్షి, అమరావతి: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి పరీక్ష కేంద్రాల ఎంపికలో ప్రాధాన్య క్రమంలో 3 ఆప్షన్లను నమోదు చేసుకొనేందుకు సెప్టెంబర్ 10 వరకు గడువు ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంయుక్త కార్యదర్శి టి.అలివేలు మంగమ్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
నవంబర్ 2 నుంచి 13వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షల కోసం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు, హైదరాబాద్‌లలో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ 14 కేంద్రాల్లో ప్రాధాన్య క్రమంలో మూడింటికి అభ్యర్థులు ఆప్షన్ ఇవ్వవలసి ఉంటుంది.
Published date : 29 Aug 2020 03:16PM

Photo Stories