పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
Sakshi Education
సాక్షి, అమరావతి: పాలిటెక్నిక్ కాలేజీల్లోని లెక్చరర్ పోస్టులకు మార్చి 12వ తేదీ నుంచి మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.
నాలుగు రోజుల పాటు ఉదయం జనరల్ స్టడీస్ పేపర్, మధ్యాహ్నం వివిధ సబ్జెక్టుల పేపర్ల పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి సబ్జెక్టుల వారీగా షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఈ మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లను https://psc.ap.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
లెక్చరర్ పోస్టులకు మెయిన్స్ పరీక్షల షెడ్యూల్
లెక్చరర్ పోస్టులకు మెయిన్స్ పరీక్షల షెడ్యూల్
తేదీ | సబ్జెక్టు |
మార్చి12 | ఆటోమొబైల్, సివిల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ |
మార్చి 13 | మెకానికల్, బయోమెడికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ |
మార్చి14 | ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, మెటలర్జికల్, మేథమెటిక్స్, జియోలజీ, ఫార్మసీ |
మార్చి 15 | ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, కెమిస్ట్రీ, కమర్షియల్ కంప్యూటర్ ప్రాక్టీస్, సిరామిక్ టెక్నాలజీ, గార్మెంట్ టెక్నాలజీ, ఇంగ్లిష్, మైనింగ్ |
Published date : 28 Feb 2020 04:32PM