పాలిటెక్నిక్ లెక్చరర్ ఇంటర్వ్యూలు మార్చి 3 కాదు 2 నుంచి ప్రారంభం
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోని వివిధ సబ్జెక్టుల పోస్టులకు ఎంపికై న అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇంతకు ముందు జారీచేసిన షెడ్యూల్ ప్రకారం ఈ ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూలు మార్చి 3 నుంచి ప్రారంభం కావలసి ఉంది. అయితే మార్చి 10వ తేదీన మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున ఇంటర్వ్యూలను మార్చి 3 నుంచి ప్రీపోన్ చేసి మార్చి 2వ తేదీకి మార్పు చేశారు. మార్చి 3 నుంచి 10వ తేదీవరకు ఉన్న ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూలను మార్చి 2 నుంచి 9 వరకు నిర్వహించనున్నారు. మార్చి 15వ తేదీనుంచి మార్చి 26వ తేదీవరకు ఉన్న ఇంటర్వ్యూల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేవు. అవి ఆ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు వివరించారు.
Published date : 18 Feb 2021 04:27PM