జనవరి 18 నుంచి బీట్ ఆఫీసర్ పోస్టులకుధ్రువపత్రాల పరిశీలన
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అటవీ విభాగం పరిధిలోని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికై న వారి ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు బుధవారం తెలిపారు.
విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఫిబ్రవరి రెండో తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని పేర్కొన్నారు. షెడ్యూల్‌ను హెచ్‌టీటీపీఎస్://పీఎస్‌సీ.ఏపీ.జీవోవీ.ఇన్’ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు తెలిపారు.
Published date : 15 Jan 2021 12:03PM