జేఎల్ మెయిన్‌సకు 79 శాతం హాజరు: ఏపీపీఎస్సీ
Sakshi Education
సాక్షి, అమరావతి: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టుల మెయిన్‌స పరీక్షలకు 79.04 శాతం మంది హాజరైనట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈనెల 17వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 44,011 మంది రిజిస్టర్ చేసుకోగా 29,471 మంది హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో 23,295 మంది పరీక్షకు హాజరయ్యారు.
Published date : 21 Feb 2020 01:33PM