Skip to main content

ఈవో పరీక్ష ఫలితాలు విడుదల

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా, శిశుసంక్షేమ శాఖలో గ్రేడ్-1 ఎక్స్‌టెన్షన్ అధికారి పోస్టు కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ అక్టోబర్ 16న విడుదల చేసింది.
ఎక్స్‌టెన్షన్ అధికారి పోస్టు కోసం ఏపీపీఎస్సీ ఈ ఏడాది ఏప్రిల్ 29న పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలో అర్హత సాధించి ఇంటర్వ్యూ కోసం ఎంపికై న అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరిచామని ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంటర్వ్యూలు నవంబర్ 18 నుంచి నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది.
Published date : 17 Oct 2019 03:43PM

Photo Stories