Skip to main content

APPSC: యూనిఫాం పోస్టుల డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ వయో పరిమితి పెంపు

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, ఇతర రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీల ద్వారా నేరుగా రిక్రూట్‌ చేసే యూనిఫాం పోస్టుల గరిష్ట వయో పరిమితిని రెండేళ్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Increase in age limit for direct recruitment of uniform posts
యూనిఫాం పోస్టుల డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ వయో పరిమితి పెంపు

గతంలో రెండేళ్ల పాటు వయోపరిమితి పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వుల గడువు సెప్టెంబర్‌తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరో రెండేళ్లు గరిష్ట వయో పరిమితిని ఏడాది పాటు పెంచుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌శర్మ సెప్టెంబర్‌ 29న ఉత్తర్వులిచ్చారు. అంటే 2023 సెప్టెంబర్‌ నెలాఖరు వరకు వయోపరిమితి రెండేళ్ల పెంపు వర్తిస్తుంది. అటవీ, ఎక్సైజ్, అగ్నిమాపక, జైళ్లు, రవాణా శాఖల్లో యూనిఫాం పోస్టుల డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌కు ఈ వయోపరిమితి పెంపు వర్తించనుంది. ప్రస్తుతం యూనిఫాం పోస్టుల భర్తీకి ఓసీలకు గరిష్ట వయోపరిమితి 24 ఏళ్లుండగా, ఇప్పుడు 26కు పెరుగుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 26 ఏళ్లుండగా, అదనంగా మరో ఐదేళ్లు పెరుగుతుంది.. అంటే వీరికి గరిష్ట వయోపరిమితి 31 ఏళ్ల వరకూ ఉంటుంది.

చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్‌ | టీఎస్‌పీఎస్సీ

Published date : 01 Oct 2022 03:05PM

Photo Stories