Skip to main content

గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్ కటాఫ్ ఎంత?

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ముగిసింది. ఎక్కడ చూసిన ఒకటే సందడి. ఏ ఇద్దరి నోట విన్నా ఒకటే సంభాషణ.. అదే ఏపీపీఏస్సీ ఫిబ్రవరి 26న నిర్వహించిన గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్ కటాఫ్ గురించి. చాలా రోజుల తర్వాత వచ్చిన సువర్ణావకాశం, లక్షల మంది పోటీ, ఏ నోట విన్నా తొంబై, వంద వంటి మాటలతో అభ్యర్థుల్లో సహజంగానే ఉత్సుకత నెలకొంది. మెయిన్స్‌కు మనం అర్హత సాధిస్తామా, లేదా? కటాఫ్ ఎంత ఉండొచ్చు? ఓ తొంబై వస్తే ఓకేనా? వంటి సందేహాలు అభ్యర్థుల మెదళ్లను తొలిచేస్తున్నాయి.
ప్రిలిమ్స్ ఫలితాలు రావడానికి దాదాపు నెల రోజులు పట్టొచ్చని అధికారులు చెప్తున్నారు. మెయిన్స్ పరీక్ష మే 21, 22న జరగనుంది. మరి ఇంత విలువైన సమయంలో ఫలితాల దాకా వేచి చూడాలా లేక ప్రిపరేషన్ కొనసాగించాలా అన్న సందిగ్ధంలో అభ్యర్థులున్నారు. ఒకవేళ ఫలితాల వరకు వేచి ఉండి ప్రిపరేషన్ సాగిద్దామంటే పట్టుమని 50 రోజుల సమయం కూడా లేదు.

మరిప్పుడు ఏం చేయాలి?
ఏపీపీఎస్సీ 982 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షకు 6,57,010 మంది దరఖాస్తు చేసుకోగా 73 శాతం అంటే 4,83,321 మంది హాజరయ్యారు. వీరిలో ఒక్కో పోస్టుకు 492 మంది పోటీ పడుతున్నారు. మెయిన్స్‌కు 1 : 50 చొప్పున మొత్తం 49100 మందిని మాత్రమే ఎంపిక చేయనున్నారు. ఈ తరుణంలో సరాసరిన ఓ వెయ్యిమందికి ఎన్ని మార్కులొచ్చాయో తెలుసుకుంటే చూచాయగా కటాఫ్ ఎంత ఉండొచ్చో అంచనాకు రావచ్చు.

మరెందుకాలస్యం మీ స్కోరు నమోదు చేసి కటాఫ్ ఎంతో తెలుసుకోండి.
 
Published date : 27 Feb 2017 05:10PM

Photo Stories