గ్రూప్-2 పోస్టులకు ఎంపికై న వారి జాబితా విడుదల
Sakshi Education
సాక్షి, అమరావతి: గ్రూప్-2 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించి.. ప్రాథమికంగా ఎంపికై న వారి జాబితాను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) సోమవారం విడుదల చేసింది.
ఆయా అభ్యర్థుల రిజిష్టర్ నంబర్ల వారీగా ఏయే పోస్టులకు ఎంపికయ్యారో తెలియజేసే జాబితాను తమ వెబ్‌సైట్‌లో పెట్టినట్లు కమిషన్ తెలిపింది. మొత్తం 16 మంది ఎంపికయ్యారని.. భర్తీకాని ఇతర పోస్టులకు సంబంధించి ప్రస్తుతమున్న విధివిధానాలు, మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల అందుబాటును అనుసరించి పరిశీలన చేస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు వివరించారు.
Published date : 22 Dec 2020 06:24PM