Skip to main content

గ్రూప్-1 ఫలితాలు విడుదల

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2011 గ్రూప్1 పరీక్షల నోటిఫికేషన్‌కు సంబంధించిన తుది ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 20న రాత్రి ప్రకటించింది.
152 పోస్టులకు పోటీపడిన 294 మంది అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షలో, ఇంటర్వ్యూల్లో వచ్చిన మార్కులను వెల్లడించింది. వీటితో పాటు మెయిన్స్ పరీక్షకు హాజరైన మొత్తం 2,691 మందికి సంబంధించి సబ్జెక్టుల వారీగా వచ్చిన మార్కులను, మొత్తం మార్కుల జాబితాలను కూడా తన వెబ్‌సైట్లో పొందుపరిచింది. 15 రకాల పోస్టులకు ఆయా అభ్యర్థుల రిజర్వేషన్ కేటగిరీ పోస్టు ప్రిఫరెన్సు తదితరాలను అనుసరించి ఈ ఎంపిక జాబితావారంలో ప్రకటిస్తామని కమిషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ ‘సాక్షి’కి వివరించారు. ఈ గ్రూప్1 ఇంటర్వ్యూల మార్కుల జాబితా లీక్‌పై సీబీసీఐడీ విచారణకు ప్రభుత్వానికి లేఖ రాయనున్నామని చెప్పారు. 2011 గ్రూప్-1లో 312 పోస్టులను భర్తీచేయాలని ఉమ్మడి రాష్ట్రంలోని ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ ప్రకారం అప్పట్లో ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించగా అందులో ఆరు ప్రశ్నల సమాధానాలు తప్పుగా ఉన్నాయని అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తపరిచారు. దానిపై న్యాయవివాదాలు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు చేరాయి. సుదీర్ఘ విచారణల అనంతరం తప్పుగా ఉన్న ఆరు ప్రశ్నలను తీసివేసి ప్రిలిమ్స్ ఫలితాలను మళ్లీ రూపొందించి మెయిన్‌‌స పరీక్షను నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ పరీక్షల నిర్వహణకు వీలుకాలేదు. దీనిపై ఉమ్మడి రాష్ట్రంలో ప్రకటించిన పోస్టులను తెలంగాణ, ఏపీ మధ్య విభజించి చివరకు 2016లో వేర్వేరుగా మెయిన్‌‌సను నిర్వహించాయి. ఈ మెయిన్‌‌స పరీక్షల్లో అర్హత సాధించిన వారిలో ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున ఏపీకి కేటాయింపు అయిన 152 పోస్టులకు 294 మందిని ఇంటర్వ్యూలకు పిలిచారు. వీరికి జనవరి 22వ తేదీనుంచి ఫిబ్రవరి 20 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. వీరికి వచ్చిన మెయిన్‌‌స, ఇంటర్వ్యూ మార్కులను కమిషన్ ఫిబ్రవరి 20న విడుదల చేసింది. మొత్తం 294 మందిలో దివ్యాంగుల కోటాలోని ఒక అభ్యర్థిని అనర్హుడిగా గుర్తించారు. నలుగురు అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకాలేదు.

ఫలితాల కోసం క్లిక్ చేయండి.
Published date : 21 Feb 2018 12:40PM

Photo Stories