Skip to main content

గ్రూప్-1 ప్రిలిమ్స్ మార్చి 31కి వాయిదా

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్-1 కేటగిరీ పోస్టులకు మార్చి 10న నిర్వహించాల్సిన ప్రిలిమ్స్/స్క్రీనింగ్ టెస్టును మార్చి 31వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 1న ఒక ప్రకటనలో పేర్కొంది.
గ్రూప్-1 సిలబస్‌ను, ప్యాట్రన్‌ను కొత్తగా మార్పు చేసి కనీస వ్యవధి కూడా ఇవ్వకుండా ప్రిలిమ్స్/స్క్రీనింగ్ టెస్టును మార్చి10న నిర్వహిస్తున్నారని నిరుద్యోగులు కొంతకాలంగా ఆందోళన వ్యక్తపరుస్తున్న సంగతి తెలిసిందే. కనీసం 120 రోజులైనా సమయం ఇవ్వాల్సి ఉన్నా కేవలం రెండు నెలలు మాత్రమే ఇచ్చారని, మరో రెండు నెలలు పరీక్షలను పొడిగించాలని వారు కోరుతున్నారు. ఈమేరకు కమిషన్‌కు, ప్రభుత్వానికి వినతిపత్రాలు అందించారు. ఈ నేపథ్యంలోనే ఏపీపీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు ఏఈఈ, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్లు, ఎండోమెంటు అసిస్టెంటు కమిషనర్ పోస్టుల స్క్రీనింగ్ టెస్టు, మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌లోనూ మార్పులు చేశారు.

హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు :
హార్టికల్చర్ పోస్టులకు నిర్ణీత అర్హతలలో మార్పులు చేసిన నేపథ్యంలో గతేడాది డిసెంబర్ 13న జారీ చేసిన హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ మరో ప్రకటనలో తెలిపింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు చేసిన అభ్యర్థులు చెల్లించిన ఫీజులను తిరిగి త్వరలోనే వెనక్కు ఇచ్చేయనున్నామని వివరించింది. రాష్ట్రంలోని మొత్తం 39 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులకు కమిషన్ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు యూజీసీ గుర్తింపు ఉన్న రాష్ట్ర యూనివర్సిటీలు, లేదా ఏ ఇతర వర్సిటీ పరిధిలోని విద్యాసంస్థలలో హార్టికల్చర్ సబ్జెక్టుతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలని పేర్కొన్నారు. అర్హతలున్న వారు లేనిపక్షంలో హార్టికల్చర్ స్పెషలైజేషన్‌తో ఎంఎస్‌సీ (అగ్రికల్చర్) పూర్తి చేసిన వారిని పరిగణనలోకి తీసుకుంటామని వివరించారు. ఎస్సీ, ఎస్టీ ఖాళీలకు సంబంధించి హార్టికల్చర్ సబ్జెక్టుతో డిగ్రీ చేసిన నిర్ణీత అర్హతలున్న వారు లేనిపక్షంలో అగ్రికల్చర్ సబ్జెక్టుతో బీఎస్సీ చేసిన వారు కూడా అర్హులేనని పేర్కొన్నారు. అయితే ఈ అర్హతల విషయంలో ఉద్యానవన శాఖ తాజాగా మార్పులు చేస్తూ జనవరి 18న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవోలో హార్టికల్చర్ అధికారుల పోస్టులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు అని కాకుండా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) గుర్తింపు ఉన్న యూనివర్సిటీల నుంచి హార్టికల్చర్ సబ్జెక్టులో బీఎస్సీ డిగ్రీ/బీఎస్సీ (హానర్స్) చేసి ఉండాలని స్పష్టం చేసింది.

గ్రూప్1తో సహా ఆయా కేటగిరీల పోస్టుల పరీక్షల తేదీల్లో మార్పులు చేస్తూ తాజాగా విడుదల చేసిన షెడ్యూల్...

కేటగిరీ

గతషెడ్యూల్

తాజా షెడ్యూల్

గ్రూప్1(ప్రిలిమ్స్)

10-3-2019

31-3-2019

ఏఈఈ (ప్రిలిమ్స్)

17-2-2019

17-2-2019

ఏఈఈ (మెయిన్స్)

1-4-2019

29-4-2019

ఏఈఈ (మెయిన్స్)

2-4-2019

30-4-2019

ఫారెస్టు రేంజ్ ఆఫీసర్లు (ప్రిలిమ్స్)

24-2-2019

10-3-2019

ఫారెస్టు రేంజ్ ఆఫీసర్లు (మెయిన్స్)

28-4-2019

14-5-2019

ఫారెస్టు రేంజ్ ఆఫీసర్లు (మెయిన్స్)

29-4-2019

15-5-2019

ఫారెస్టు రేంజ్ ఆఫీసర్లు (మెయిన్స్)

30-4-2019

16-5-2019

అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంటు

3-4-2019

9-5-2019

అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంటు

4-4-2019

10-5-2019

Published date : 02 Feb 2019 11:54AM

Photo Stories