Skip to main content

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు వెల్లడించవద్దు

సాక్షి, అమరావతి: గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను వెల్లడించవద్దని ఏపీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజని సెప్టెంబర్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీపీఎస్సీని ఆదేశించి తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. 169 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం 2018, డిసెంబర్ 31న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ పరీక్షల్లో లోపాలపై షేక్ షానవాజ్, మరో 14 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను నాలుగు వారాల పాటు వెల్లడించవద్దని, డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) గ్రేడ్-2 పరీక్షా ఫలితాలను కూడా ప్రకటించవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
Published date : 01 Oct 2019 03:55PM

Photo Stories