గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: గూప్-1 ప్రాథమిక పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్పీ)ఈనెల 27నప్రకటించింది.
ఈ పరీక్షలో మొత్తం 3900 మంది ఉత్తీర్ణత సాధించారు. 78 పోస్టుల భర్తీకి ఈ నెల 7న ఏపీపీఎస్సీ ప్రాథమిక పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. 54,956 మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున అభ్యర్థులను మెయిన్స్కు ఏపీపీఎస్సీ ఎంపిక చేసింది. ప్రాథమిక పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్లో పొందవచ్చు. కాగా, మెయిన్స్ పరీక్షలు ఆగస్టు 17 నుంచి 27 వరకు జరగనున్నాయి.
ఫలితాల కోసం క్లిక్ చేయండి
https://www.sakshieducation.com/Results/ResultsStory.aspx?nid=165878&cid=25&sid=344&chid=1503&tid=0
ఫలితాల కోసం క్లిక్ చేయండి
https://www.sakshieducation.com/Results/ResultsStory.aspx?nid=165878&cid=25&sid=344&chid=1503&tid=0
Published date : 29 May 2017 03:12PM