Skip to main content

గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష సమయం 3 గంటలు

సాక్షి, అమరావతి: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి ప్రతి పేపర్‌కు 3 గంటలు (180 నిమిషాలు) సమయంగా నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబర్ 16న ఓ ప్రకటనలో పేర్కొంది.
ఈ పరీక్ష నోటిఫికేషన్లో కొన్నిచోట్ల 150 నిముషాల సమయం అని ఉండడంతో కమిషన్ సెప్టెంబర్ 16న సవరణ ప్రకటన విడుదల చేసింది. అలాగే పేపర్ 1లోని జనరల్ ఎస్సేకు సంబంధించిన 7 కేటగిరీల సబ్జెక్టులను 3 విభాగాలుగా విభజించింది. ఏ విభాగంలో ఏయే సబ్జెక్టులు ఉంటాయో వివరించింది.

1వ విభాగం: కరెంట్ అఫైర్స్
2వ విభాగం: సోషియో పొలిటికల్, సోషియో ఎకనమిక్, సోషియో ఎన్విరాన్మెంట్ అంశాలు
3వ విభాగం: కల్చర్ అండ్ హిస్టారికల్ ఏస్పెక్ట్స్, సివిక్ రిలేటెడ్ ఇష్యూస్, రెఫ్లెక్టివ్ టాపిక్స్
Published date : 17 Sep 2019 12:09PM

Photo Stories