Skip to main content

గ్రూప్-1 మెయిన్స్‌ హాల్ టికెట్లు జారీ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్ష హాల్ టికెట్లను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వెబ్‌సైట్‌లో సిద్ధం చేసింది.
అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గ్రూప్- 1 మెయిన్స్‌ పరీక్షలు ఆగస్టు 17 నుంచి 28వ తేదీ వరకు జరగనున్నాయి. గ్రూప్-1 కేడర్‌కు సంబంధించిన 78 పోస్టుల భర్తీకి 2016 డిసెంబర్ 30న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. మెయిన్స్‌ పరీక్ష పెన్ను-పేపర్ ఆధారితంగా డిస్క్రిప్టివ్ తరహాలో ఉంటుంది. మొత్తం 6 పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ జనరల్ ఇంగ్లిష్ 150 మార్కులకు ఉంటుంది. ఇది కేవలం క్వాలిఫయింగ్ పరీక్ష మాత్రమే. మిగిలిన 5 పేపర్లు ఒక్కొక్కటి 150 మార్కుల చొప్పున ఉంటాయి. మెయిన్స్‌లో అర్హత సాధించిన వారిలో 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ 75 మార్కులకు ఉంటుంది.
Published date : 10 Aug 2017 03:57PM

Photo Stories