గ్రూప్-1 ఇంటర్వ్యూ బోర్డుకు 18 మంది నామినీలు
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2011లో జారీ చేసిన గ్రూప్-1 పోస్టుల నోటిఫికేషన్‌కు సంబంధించి అర్హులైన అభ్యర్థుల ఎంపికకోసం ఇంటర్వ్యూలు నిర్వహించే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డులో నియమించేందుకు ఉన్నతాధికారుల పేర్లను నామినీలుగా సూచిస్తూ ప్రభుత్వం జనవరి 12న ఉత్తర్వులిచ్చింది.
ఇందులో వివిధ శాఖలకు చెందిన 18 మంది అధికారుల పేర్లను ప్రభుత్వం పొందుపరిచింది. వీరినుంచి కొంతమందిని ఇంటర్వ్యూల బోర్డులోకి ఏపీపీఎస్సీ తీసుకోనుంది.
Published date : 13 Jan 2018 02:06PM