ఏపీపీఎస్సీ వివిధ పరీక్షల తేదీల్లో మార్పులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు పరీక్షల తేదీల్లో మార్పులు చేస్తూ కొత్త షెడ్యూల్‌ను తన వెబ్‌సైట్లో పొందుపరిచింది.
మెయిన్ పరీక్షల్లో వ్యవసాయ విస్తరణాధికారుల పరీక్షలు ఏప్రిల్ 29న, అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్ లేటర్ పరీక్షలు ఏప్రిల్ 29, 30న, రీసెర్చ్ ఆఫీసర్ పోస్టులకు ఏప్రిల్ 28, 29న, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్టులకు ఏప్రిల్ 29, 30న, ఏఈఈ పోస్టులకు మే 14, 15న, గణాంక శాఖ అసిస్టెంట్ డైరక్టర్ పోస్టులకు మే 14, 15న నిర్వహించనుంది. స్క్రీనింగ్ టెస్టులకు సంబంధించి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు జూన్ 9న, ఫారెస్టు బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు జూన్ 16న పరీక్షలు నిర్వహించనుంది.
ఏపీపీఎస్సీ పరీక్షల కొత్త షెడ్యూల్ కోసం క్లిక్ చేయండి
ఏపీపీఎస్సీ పరీక్షల కొత్త షెడ్యూల్ కోసం క్లిక్ చేయండి
Published date : 19 Mar 2019 01:09PM