ఏపీపీఎస్సీ పోస్టుల భర్తీకి కొత్త ప్రతిపాదనలు...!
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగాల భర్తీకి నిర్వహించనున్న పరీక్షల విషయంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది.
ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు ఉన్న విధానానికి భిన్నంగా రెండంచెల పరీక్షలతోనే పోస్టుల భర్తీ చేసేలా కొత్త విధానంపై కసరత్తు చేస్తోంది. ఇది కార్యరూపం దాలిస్తే పోస్టుల భర్తీకి ఇకపై రెండు కేటగిరీలుగా పరీక్షలు జరగనున్నాయి. ఎగ్జిక్యూటివ్ సహ ఉన్నత స్థాయి పోస్టులన్నీ గ్రూప్-1 కేటగిరీగా, మిగిలిన పోస్టులన్నీ గ్రూప్-2 కేటగిరీగా ఉండనున్నాయి. సమాన విద్యార్హతలున్న వాటిని ఒకే గూటి కిందకు చేర్చి ఒకే పరీక్ష ద్వారా మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేయాలన్నది ఈ కొత్త ప్రతిపాదనల ఉద్దేశం. దీనివల్ల ఏపీపీఎస్‌సీకి పలుమార్లు పరీక్షల నిర్వహణ భారం తగ్గడంతో పాటు అభ్యర్థులకు కూడా పలుసార్లు పరీక్షల కోసం సన్నద్ధం కావడం, అందుకు వేలాది రూపాయలు ఖర్చు చేయడం వంటి ఇబ్బందులు కొంతవరకు తప్పుతాయన్న అభిప్రాయం ఉంది.
ప్రస్తుతం పోస్టుల వారీగా నోటిఫికేషన్లు...
ఇప్పటివరకు ప్రభుత్వోద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 పోస్టుల వారీగా పలు నోటిఫికేషన్లు జారీచేస్తోంది. అలాగే, ప్రత్యేక పోస్టులకు వేరేగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. కాగా, ప్రస్తుత ప్రభుత్వం గ్రూప్-4 పోస్టుల భర్తీని పూర్తిగా నిలిపివేయడంతో పాటు తక్కిన కేటగిరీ పోస్టుల్లోనూ వేలాది ఖాళీలున్నా నామమాత్రపు సంఖ్యలోనే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చింది. పోస్టులు సంఖ్య తక్కువగా ఉన్నా ఒకే అర్హత కలిగిన పోస్టులకు వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చింది. అంతేకాక.. మాన్యువల్ పరీక్షలకు భిన్నంగా ఇప్పుడు వేర్వేరు తేదీల్లో ఆన్‌లైన్‌లో రోజుకు 50వేల మందికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒకే పోస్టుకు ఒకే పరీక్ష, ఒకే పేపర్‌ను వేర్వేరు రోజుల్లో వేర్వేరు సెషన్ల కింద నిర్వహిస్తున్నారు. దీనివల్ల ఏపీపీఎస్సీకి పరీక్షల నిర్వహణ భారంగా మారుతోంది. అభ్యర్థులు కూడా వేర్వేరు పోస్టులకు వేర్వేరు పరీక్షలు రాయాల్సి వస్తోంది. గతంలో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఒకే పరీక్ష ఉండగా ఇప్పుడు ఆన్‌లైన్‌లో స్క్రీనింగ్ టెస్టుతో ఒకే పోస్టుకు రెండుసార్లు పరీక్ష తప్పనిసరైంది. అన్నిటికీ ఒక్కటే విద్యార్హత ఉన్నా ఇలా పలుమార్లు పరీక్ష రాయడం వారికీ ఇబ్బందిగా మారుతోంది. ఉదా.. 2016లో ఏపీపీఎస్సీ 4,275 పోస్టులకు 31 నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇటీవల ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం 18,450 పోస్టులకు వేర్వేరుగా 14 నోటిఫికేషన్లు జారీచేయగా మరో 13 నోటిఫికేషన్ల జారీకి నిర్ణయించింది. ఇందులో చాలావరకు డిగ్రీ తత్సమాన విద్యార్హతలున్న పోస్టులున్నాయి. కొన్ని వేర్వేరు పోస్టులకు సాంకేతిక విద్యార్హతలున్నాయి. అర్హతలు ఒక్కటే అయినా నోటిఫికేషన్ల వారీగా వేర్వేరు పరీక్షలను నిర్వహించారు. అలాగే, పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు గ్రూప్-3 నోటిఫికేషన్ ఇచ్చారు. డిప్యూటీ తహసీల్దార్లు, ఎండీఓ, ఏఎస్‌ఓ వంటి మరికొన్ని పోస్టులను గ్రూప్-2 నోటిఫికేషన్లో పెట్టారు. వీటన్నిటికీ డిగ్రీయే విద్యార్హత. కానీ, వేర్వేరు నోటిఫికేషన్లు ఇవ్వడంతో అభ్యర్థులు వేర్వేరుగా ఫీజులు చెల్లించి దరఖాస్తు చేశారు. ఏపీపీఎస్సీ కూడా వీటికి వేర్వేరుగా పరీక్షలు నిర్వహించింది.
కొత్త ప్రతిపాదనలు ఇలా...
ఏపీపీఎస్సీ తాజాగా చేస్తున్న ప్రతిపాదనల ప్రకారం ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1 కేటగిరీ కింద భర్తీ చేయనుంది. ప్రస్తుతం గ్రూప్-2లో ఉన్న పలు ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1లో కలపాలంటే ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

- ప్రస్తుతం గ్రూప్-1కు నిర్వహిస్తున్న తరహాలోనే ప్రిలిమ్స్‌ను ఆబ్జెక్టివ్‌లో, మెయిన్స్ ను డిస్క్రిప్టివ్‌లో ఈ పోస్టులకు పరీక్షలు నిర్వహిస్తారు.
- ఇక గ్రూప్-2, గ్రూప్-3, ఇతర ప్రత్యేక పోస్టుల అర్హతలనూ పరిగణనలోకి తీసుకుని ఆయా పోస్టులలో ఒకే విద్యార్హత ఉన్న వాటికి ఒకే నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
- డిప్యూటీ తహసీల్దార్లు, ఎండీఓ, ఏఎస్‌ఓ, ఈఓపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శి తదితర అన్ని కేటగిరీల పోస్టులన్నిటికీ కలిపి నోటిఫికేషన్ ఇస్తారు.
- ఒకేసారి స్క్రీనింగ్ టెస్టు, మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు.
- మెయిన్స్ లో పేపర్-1లో జనరల్ సబ్జెక్టులకు సంబంధించి ఆబ్జెక్టివ్ ప్రశ్నలుంటాయి. పేపర్-2లో ఆయా అభ్యర్థుల అర్హతలను అనుసరించి సబ్జెక్టులపై వేర్వేరుగా ప్రశ్నలు ఇస్తారు.
- ఈ పరీక్షల్లో ఆయా అభ్యర్థులకు వచ్చిన మార్కులు, మెరిట్‌ను రిజర్వేషన్ల వారీగా పరిగణనలోకి తీసుకుని పోస్టులకు ఎంపికచేస్తారు.
- ఈ విధానంవల్ల ఒకే విద్యార్హత ఉన్న పోస్టులకు ఒకే పరీక్ష నిర్వహించడం ద్వారా ఏపీపీఎస్సీకి నిర్వహణ భారం తప్పుతుంది. అదే సమయంలో ఒకే పరీక్ష ద్వారా సమయం కూడా చాలా కలిసివచ్చి ఆయా పోస్టులను త్వరితంగా భర్తీచేయడానికి వీలుంటుంది.
- మరోవైపు పలు రకాల నోటిఫికేషన్లకు ఫీజుల చెల్లింపు, దరఖాస్తు సమర్పణ, వాటికి ప్రిపరేషన్, వేర్వేరు పరీక్షలు రాయాల్సి రావడం కూడా అభ్యర్థులకు ఉండదు. అన్ని పోస్టులకు ఒకే పరీక్ష రాయడం ద్వారా వారికి చాలా వెసులుబాటు కలుగుతుంది.
- ఒకే నోటిఫికేషన్లో పోస్టులు ప్రకటిస్తున్నందున అవి మిగిలిపోకుండా అన్నీ భర్తీ అయ్యే అవకాశముంటుంది.
Published date : 12 Feb 2019 03:40PM