Skip to main content

ఏపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షలు వాయిదా

సాక్షి, అమరావతి: వివిధ పోస్టుల భర్తీకి అక్టోబర్, నవంబర్ నెలల్లో నిర్వహించాల్సిన మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి అక్టోబర్ 15 ఒక ప్రకటనలో తెలిపారు.
పాలనాపరమైన కారణాల వల్ల వీటిని వాయిదా వేస్తున్నట్లు వివరించారు. ఈ పరీక్షలు నిర్వహించే తేదీలను అక్టోబర్ 22న ప్రకటిస్తామన్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, గెజిటెడ్ పోస్టులు, పాలిటెక్నిక్ లెక్చరర్లు, నాన్ గెజిటెడ్ పోస్టులు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులకు సంబంధించిన పరీక్షలు వాయిదా పడ్డాయి.
Published date : 16 Oct 2019 12:10PM

Photo Stories