ఏపీపీఎస్సీ గూప్-1 మెయిన్స్ తొలిరోజు 84.79 శాతం హాజరు
Sakshi Education
సాక్షి, అమరావతి/ఎచ్చెర్ల క్యాంపస్: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు తొలిరోజు సోమవారం 84.79 శాతం మంది హాజరయ్యారని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మొత్తం 8,348 మంది హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోగా.. వారిలో 7,079 మంది తొలిరోజు తెలుగు పేపర్ (క్వాలిఫయింగ్) పరీక్షకు హాజరయ్యారన్నారు.
ఓఎంఆర్ షీట్ల తారుమారు
శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల వెంకటేశ్వరా ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో 50 మంది అభ్యర్థులకు సంబంధించి ఓఎంఆర్ సీట్లు తారమారయ్యాయి. కాకినాడ అదిత్య ఇంజినీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రానికి చెందిన బండిల్ ఇక్కడికి, ఇక్కడి బండిల్ అక్కడికి చేరినట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రశ్న పత్రాలకు ప్రత్యేకంగా మూల్యాంకనం నిర్వహించే ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు అభ్యర్థులకు హామీ ఇచ్చారు.

Published date : 15 Dec 2020 02:52PM