ఏపీపీఎస్సీ గ్రూప్-1మెయిన్స్ పరీక్షలకు ఆప్షన్లను మార్చుకునే అవకాశం!
Sakshi Education
సాక్షి, అమరావతి: గ్రూప్1 మెయిన్స్ పరీక్షలకు ఇటీవల కొత్తగా అదనంగా ఎంపికైన అభ్యర్థులు తమ ఆప్షన్లను మార్పు చేసుకొనేందుకు వీలు కల్పిస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పరీక్ష రాసే మీడియం, పోస్టు ప్రిఫరెన్స్, పరీక్ష కేంద్రం తదితర అంశాల ఆప్షన్లను ఈనెల 10లోగా మార్పు చేసుకోవాలన్నారు. ఇంతకు ముందు ఇచ్చిన ఆప్షన్లలో మార్పులు అవసరం లేదనుకున్న వారు కొత్తగా ఆప్షన్లను నమోదు చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్లను మార్పు చేసుకుంటే వాటిని మాత్రమే కమిషన్ పరిగణనలోకి తీసుకుంటుంది. పరీక్ష కేంద్రాల కేటాయింపునకు సంబంధించి కేంద్రాల అందుబాటును అనుసరించి తుది నిర్ణయం కమిషన్ తీసుకుంటుంది.
Published date : 04 Nov 2020 03:50PM