ఏపీపీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్ రద్దు చేయండి...!
Sakshi Education
సాక్షి, అమరావతి: గ్రూప్–1 మెయిన్స్ నిర్వహణలో అక్రమాలు జరిగాయని.. అందువల్ల దీనిని రద్దు చేసి, మళ్లీ పరీక్ష నిర్వహించేలా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
అలాగే పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ 138 మంది అభ్యర్థులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇంటర్వ్యూలతో సహా తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరారు. గ్రూప్–1 మెయిన్స్‌పై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేలా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, కార్యదర్శి తమకు లేని అధికారాలను ఉపయోగించి.. గ్రూప్–1 పరీక్షల మధ్యలో నిబంధనలను మార్చేశారని పేర్కొన్నారు. దీనిని రాజ్యాంగ విరుద్ధంగా, సర్వీస్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రకటించాలని కోరారు. జవాబు పత్రాల మూల్యాంకనం బాధ్యతలను అనధికార వ్యక్తులకు అప్పగించారని, ఇది కూడా నిబంధనలకు విరుద్ధమన్నారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపే అవకాశం ఉంది.
చదవండి: ఏపీపీఎస్సీ గ్రూప్–1 ఇంటర్వ్యూ బోర్డును అభ్యర్థులే ఇలా ఎంచుకోవచ్చు..
చదవండి: జూన్ 16 నుంచి పాఠశాల విద్యార్ధులకు డిజిటల్ తరగతులు?
చదవండి: ఏపీపీఎస్సీ గ్రూప్–1 ఇంటర్వ్యూ బోర్డును అభ్యర్థులే ఇలా ఎంచుకోవచ్చు..
చదవండి: జూన్ 16 నుంచి పాఠశాల విద్యార్ధులకు డిజిటల్ తరగతులు?
Published date : 15 Jun 2021 02:38PM