Skip to main content

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలి!

సాక్షి, అమరావతి: గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన బీసీ, ఈబీసీ, కాపు విద్యార్థులకు వైఎస్సార్ విద్యోన్నతి పథకం ద్వారా మెయిన్ పరీక్షలకు ఇస్తున్న శిక్షణ పూర్తయ్యే వరకు పరీక్షలు వాయిదా వేయాలని పలువురు నిరుద్యోగులు జనవరి 17 (శుక్రవారం)నఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఏపీపీఎస్సీ గ్రూప్స్ ప్రిపరేషన్, మెటీరియల్, బిట్‌బ్యాంక్స్, ఇతర అప్‌డేట్స్ కోసంక్లిక్ చేయండి.

ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేసి జనవరి 11వ తేదీ నుండి గ్రూప్-1 మెయిన్ పరీక్షలకు శిక్షణ ప్రారంభించిందని, శిక్షణ పూర్తయ్యే వరకు పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా యూపీఎస్సీ మెయిన్స్లో అర్హత సాధించిన వారికి ఫిబ్రవరిలో ఇంటర్వూలు ఉండడంతో వారూ నష్టపోయే ప్రమాదం ఉన్నందున కనీసం రెండు నెలల పాటు పరీక్షలు వాయిదా వేయాలని కోరారు.
Published date : 18 Jan 2020 02:02PM

Photo Stories