ఏపీపీఎస్సీ డిప్యూటీ సర్వేయర్ పోస్టులకు ఎంపిక జాబితా సిద్ధం
Sakshi Education
సాక్షి, అమరావతి: సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో డిప్యుటీ సర్వేయర్ పోస్టులకు నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించిన వారిలో ప్రాథమికంగా ఎంపికై న అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది.
ఈ జాబితా కమిషన్ వెబ్‌సైట్ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. పీఎస్‌సీ.ఏపీ.జీవోవీ.ఐఎన్’లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీ టౌన్‌ప్లానింగ్, కంట్రీ ప్లానింగ్ సబార్డినేట్ సర్వీసెస్‌లో ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ పోస్టులకు నిర్వహించిన పరీక్షల్లో ఎంపికై న అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసినట్లు కార్యదర్శి పేర్కొన్నారు.
Published date : 25 Jan 2020 02:44PM