‘ఏఈఈ’ హాల్‌టిక్కెట్ల నంబర్ల దిద్దుబాటు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏఈఈ) పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 6న నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టులో కొందరి హాల్‌టిక్కెట్లపై గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. ఏపీపీఎస్సీ తాజాగా ఆయా అభ్యర్థులకు కొత్త హాల్‌టిక్కెట్ నంబర్లను కేటాయించింది.
ఈ మేరకు ఏపీపీఎస్సీ మంగళవారం తన వెబ్‌సైట్లో అభ్యర్థుల వారీగా కొత్త హాల్‌టిక్కెట్ల నంబర్ల జాబితాను పొందుపరిచింది. మొత్తం 837 మందికి హాల్‌టిక్కెట్ల జారీలో సమస్యలు ఏర్పడ్డాయి. పలువురికి ఒకే నంబర్‌తో హాల్‌టిక్కెట్లు అందాయి. వారిని పరీక్షలకు అనుమతించిన ఏపీపీఎస్సీ ఆన్‌లైన్‌లో హాల్‌టిక్కెట్ల జారీలో ఈ పొరపాటు జరిగినట్లు గుర్తించింది. వారికి కొత్తగా హాల్‌టిక్కెట్ల నంబర్లను కేటాయించి, వారి ఓఎమ్మార్ పత్రాలను మూల్యాంకనం చేయించింది.
Published date : 30 Nov 2016 03:09PM