డీఎస్సీరాత పరీక్షల తర్వాతే నైపుణ్య పరీక్షలు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఏపీ డీఎస్సీ 2018కి సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు భౌతిక సామర్థ్య పరీక్షలు, మ్యూజిక్ టీచర్లకు నైపుణ్య పరీక్షలు డీఎస్సీ పరీక్ష తర్వాతే ఉంటాయని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా కమిషనర్ కె.సంధ్యారాణి తెలిపారు.
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు భౌతిక సామర్థ్య పరీక్షలు 30 మార్కులకు ఉంటాయని, సంగీత టీచర్లకు స్కిల్ పరీక్షలు 30 మార్కులకు ఉంటాయని వెల్లడించారు. వీటికి సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ అంశాలను అభ్యర్థులు దృష్టిలో ఉంచుకొని తొలుత డీఎస్సీకి సన్నద్ధం కావాలని కమిషనర్ సూచించారు.
Published date : 15 Nov 2018 03:45PM