Skip to main content

డీఎస్సీఅభ్యర్థులకు జనవరి 4 నుంచి భౌతిక సామర్థ్య పరీక్షలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2018 నోటిఫికేషన్‌కు సంబంధించి జనవరి 4వతేదీ నుంచి భౌతిక సామర్థ్య పరీక్షల కోసం పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది.
మొత్తం 337 మంది స్కూల్ అసిస్టెంట్ (వ్యాయామ) అభ్యర్థులకు గాను 285 మంది, 13,839 పిఈటీ అభ్యర్థులకు గాను 12,551 మంది అభ్యర్థులు భౌతిక సామర్థ్య పరీక్షల కోసం ఆన్‌లైన్లో వెబ్‌ఆప్షన్లు నమోదు చేశారని పాఠశాల విద్యా కమిషనర్ కె.సంధ్యారాణి వెల్లడించారు. మిగిలిన వారు ఆప్షన్లు నమోదు చేయలేదన్నారు. ఈ మేరకు కమిషనర్ డిసెంబర్ 31న పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆప్షన్లు నమోదు చేసుకొన్న అభ్యర్థులకు నాగార్జున యూనివర్శటీలో జనవరి 4 నుంచి 13 వరకు 10 రోజులు పాటు భౌతిక సామర్థ్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మొత్తం 10 రోజుల పాటు రోజుకు 1400 మంది అభ్యర్థుల చొప్పున రెండు సెషన్లలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని కమిషనర్ వివరించారు. వెబ్ ఆప్షన్ నమోదు చేయని అభ్యర్థులకు ఉమ్మడిగా 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్‌ను కేటాయించామన్నారు. అలాగే షాట్‌పుట్ తప్పనిసరిగా వుంటుందని, వీరికి చివరి రోజు భౌతిక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. భౌతిక సామర్థ్య పరీక్షల హాల్ టికెట్లు, అభ్యర్థులకు సూచనలు, విధివిధానాలు '' cse.ap.gov.in '' వెబ్‌సైట్లో జనవరి 1 సాయంత్రం నుంచి ఉంచుతామన్నారు. ఫలితాలు అదే రోజు సాయంత్రం ఏఎన్ యూలోని నోటీసు బోర్డులో, కమిషన్ వెబ్‌సైట్‌లో, అభ్యర్థుల చరవాణీలకు సంక్షిప్త సమాచారం ద్వారా పంపిస్తామని అన్నారు. .
Published date : 01 Jan 2019 04:16PM

Photo Stories