Skip to main content

డిగ్రీ, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు అర్హుల జాబితా

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీల్లోని వివిధ అధ్యాపక పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాలను ఏపీపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది.
ఈ మేరకు కమిషన్ కార్యదర్శి ఆంజనేయులు ప్రకటన జారీ చేశారు. ఒక్కొక్క పోస్టుకు ఇద్దరు చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసి జాబితా విడుదల చేశారు. వీరికి ఇంటర్వ్యూ తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఇంటర్వ్యూలు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో నిర్వహిస్తారు. ధ్రువపత్రాలు, ఇతర పత్రాలకు సంబంధించిన సమాచారాన్ని కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అభ్యర్థులు వాటిని సందర్శించి పత్రాలను నిర్ణీత అటెస్టేషన్లను చేయించుకొని ఇంటర్వ్యూల సమయంలో కమిషన్ కార్యాలయంలో పరిశీలనకు తీసుకురావాలి. డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులకు సంబంధించి 493 మంది, పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టులకు సంబంధించి 695 మందితో జాబితాలను కమిషన్ విడుదల చేసింది.
Published date : 23 Jan 2021 04:39PM

Photo Stories