Skip to main content

APPSC recruitment 2021: త్వరలో 1,180 ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అన్ని ఏర్పాట్లు చేసింది.
మరో వారం పది రోజుల్లో నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. ఈ నెలాఖరున నోటిఫికేషన్లు విడుదల చేసేలా కమిషన్‌ కసరత్తు పూర్తి చేసి అంతా సిద్ధంగా ఉంచింది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వుడ్‌ క్యాటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితి పెంపునకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల కాలపరిమితి మే నెలలో ముగిసింది. ఈ నేపథ్యంలో రిజర్వుడ్‌ అభ్యర్ధుల గరిష్ట వయో పరిమితి ఉత్తర్వుల పొడిగింపుపై కమిషన్‌ ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. మరోవైపు అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్‌) ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం కోటా అమలుకు ప్రభుత్వం ఇంతకు ముందే ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ కోటాలో పోస్టులు మిగిలితే కనుక వాటిని క్యారీ ఫార్వర్డ్‌ చేయాలా? వద్దా? అనే అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత కోసం కమిషన్‌ లేఖ రాసింది. ఈ రెండు అంశాలపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడగానే నోటిఫికేషన్లను విడుదల చేయనున్నారు. 1,180 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఇప్పటికే జీవో 49 విడుదల చేయడం తెలిసిందే. రిజర్వేషన్లు, ఈడబ్ల్యూఎస్‌ కోటా మిగులు పోస్టులపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందగానే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇస్తుందని కమిషన్‌ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వం నుంచి స్పష్టత రాగానే 15 విభాగాల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటాను అమలు చేస్తూ పోస్టుల భర్తీకి కమిషన్‌ చర్యలు చేపట్టనుంది.

ఏపీపీఎస్సీ గ్రూప్ 1,2,3,4 స్టడీ మెటీరియల్, బిట్ బ్యాంక్స్, ప్రీవియస్ పేపర్లు, ఆన్ లైన్ కోచింగ్ క్లాసులు, ఆన్ లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్.. ఇతర తాజా అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

నోటిఫికేషన్‌ ఇవ్వనున్న పోస్టులు

పోస్టు

సంఖ్య

మెడికల్‌ ఆఫీసర్‌(యునాని)

26

మెడికల్‌ ఆఫీసర్‌(హోమియోపతి)

53

మెడికల్‌ ఆఫీసర్‌ (ఆయుర్వేద)

72

లెక్చరర్‌(హోమియో)

24

లెక్చరర్‌(డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌జీఏసీ ఆయు‹Ù)

3

జూ.అసిస్టెంట్, కంప్యూటర్‌ అసిస్టెంట్‌

670

అసిస్టెంట్‌ ఇంజనీర్లు

190

ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్స్‌ గ్రేడ్‌–3 (ఎండోమెంట్‌)

60

హార్టికల్చర్‌ ఆఫీసర్‌

39

తెలుగు రిపోర్టర్‌ (లెజిస్లేచర్‌)

5

డి్రస్టిక్ట్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌

4

ఇంగ్లిష్‌ రిపోర్టర్‌ (లెజిస్లేచర్‌)

10

జూనియర్‌ లెక్చరర్‌ ఏపీఆర్‌ఈఐ సొసైటీ

10

డిగ్రీ లెక్చరర్‌ ఏపీఆర్‌ఈఐ సొసైటీ

5

అసిస్టెంట్‌ కన్జర్వేటర్, ఫారెస్ట్‌ సర్వీస్‌

9

మొత్తం

1,180

Published date : 31 Aug 2021 03:24PM

Photo Stories