Free Coaching for Group II: గ్రూప్–2 ఉచిత శిక్షణ దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..
Sakshi Education
ఎంవీపీ కాలనీ: స్థానిక సర్దార్ గౌతు లచ్చన్న ఏపీ బీసీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్–1, గ్రూప్–2 అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్షలపై శిక్షణ ఇవ్వనున్నారు.
గ్రూప్–2 శిక్షణ దరఖాస్తులకు డిసెంబర్ 22 సాయంత్రంతో గడువు ముగియనుంది. అనంతరం వచ్చిన దరఖాస్తులను డిగ్రీలో వచ్చిన మార్కులు ఆధారంగా మెరిట్ నిర్ణయించి 40 మందిని ఎంపిక చేయనున్నారు.
చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్ | టీఎస్‌పీఎస్సీ
డిసెంబర్ 27వ తేదీ నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. గ్రూప్–1 అభ్యర్థులు ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31వ వరకు గడువు ఉంది. ఈ శిక్షణకు 60 మందిని ఎంపిక చేయనున్నారు. పూర్తి వివరాలకు 0891–2564346, 9492569177 నంబర్లలో సంప్రదించవచ్చు.
Published date : 22 Dec 2023 01:10PM