Skip to main content

8 నుంచి ఏఎన్‌యూలో పీసెట్ ఫిజికల్ టెస్టులు

ఏఎన్‌యూ(గుంటూరు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న పీసెట్- 2017లో భాగంగా ఆచార్య నాగార్జున యూని వర్సిటీలో ఈ నెల 8వ తేదీ నుంచి ఫిజికల్ టెస్టులు ప్రారంభం కానున్నాయి.
ఈ పరీక్షలకు 4,600 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పురుషుల విభాగంలో ఈ నెల 8న హాల్‌టికెట్ నంబర్ 170001 నుంచి 170456 వరకు, 9వ తేదీన 170457 నుంచి 170913 వరకు, 10న 170914 నుంచి 171372 వరకు, 11న 171373 నుంచి 171841 వరకు, 12న 171842 నుంచి 172316 వరకు, 13న 172317 నుంచి 172784 వరకు, 14న 172785 నుంచి 173240 వరకు, 15న 173241 నుంచి 173688వ హాల్‌టికెట్ నంబరు వరకు ప్రవేశ పరీక్షలు జరుగుతాయి. మహిళల కేటగిరీలో ఈ నెల 16, 17 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. పరీక్షల్లో భాగంగా 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, హైజంప్, షాట్‌పుట్, 800 మీటర్ల పరుగు, మహిళలకు 400 మీటర్ల పరుగుతో పాటు అభ్యర్థి ఎంచుకున్న ఒక క్రీడలో నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు.
Published date : 08 May 2017 04:57PM

Photo Stories