AP TET 2022 Paper 2A, 2B: పెడగాజి సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయంటే..
అభ్యర్థులు జూన్ 15 నుంచి జూలై 15వ తేదీ వరకు టెట్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. జూన్ 16 నుంచి జులై 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాలి. aptet.apcfss.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. టెట్ సిలబస్‌ను కూడా పాఠశాల విద్యా శాఖ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో పొందుపరిచింది.
TET/DSC 2022: కచ్చితంగా ఉద్యోగం సాధించాలనుకునే వారికి మాత్రమే..
ఏపీ టెట్ 2022 ఇలా
- రాష్ట్రంలో.. టెట్‌ను పేపర్–1ఎ, 1బి, పేపర్–2ఎ, 2బిల పేరుతో మొత్తం నాలుగు పేపర్లుగా నిర్వహించనున్నారు.
- పేపర్–1ఎ: ఒకటి నుంచి అయిదో తరగతి వరకు ఉపాధ్యాయులుగా బోధించాలనుకునే వారు రాయాల్సిన పరీక్ష.. పేపర్–1ఎ.
- పేపర్–1బి: ఒకటి నుంచి అయిదో తరగతి వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పనిచేయాలనుకునే వారు హాజరు కావల్సిన పరీక్ష ఇది. స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్స్‌లో టీచర్లకు ఈ పేపర్ ఉత్తీర్ణత తప్పనిసరి అనే ఎన్‌సీటీఈ నిబంధనలకు అనుగుణంగా దీన్ని ప్రవేశ పెట్టారు.
- పేపర్–2ఎ: ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు స్కూల్ అసిస్టెంట్‌గా బోధించాలనుకునే వారు ఉత్తీర్ణత సాధించాల్సిన పేపర్ ఇది.
- పేపర్–2బి: ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్‌గా బోధించాలనుకునే వారు హాజరు కావల్సిన పరీక్ష ఇది.
AP TET 2022 Paper 1A, 1B: పేపర్-1 పరీక్షలో ఏఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయంటే..
అర్హతలు
- తరగతుల వారీగా పేపర్లను నిర్దేశించిన నేపథ్యం లో.. ఆయా పేపర్లకు హాజరయ్యేందుకు అవసరమైన కనీస అర్హత నిబంధనలను స్పష్టంగా పేర్కొన్నారు. పేపర్‌ను బట్టి ఇంటర్మీడియెట్, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీతోపాటు డీఈడీ/బీఈడీ/లాంగ్వేజ్ పండిట్/యూజీడీపీ ఈడీ/డీపీఈడీ/బీపీఈడీ/తత్సమాన అర్హతలు ఉండాలి.
ఇవి పాటిస్తే.. టీచర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips
పరీక్ష విధానం ఇలా..
టెట్ పేపర్–1ఎ, 1బి, పేపర్–2ఎ, 2బిలను 150 మార్కులకు నిర్వహిస్తారు. అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ప్రతి పేపర్‌కు 2:30 గంటల సమయం అందుబాటులో ఉంటుంది. పేపర్–2కి సంబంధించిన వివరాలు ఇలా..
పేపర్–2ఎ
విభాగం | సబ్జెక్ట్ | ప్రశ్నలు | మార్కులు |
1. | చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజి | 30 | 30 |
2. | లాంగ్వేజ్1 | 30 | 30 |
3. | లాంగ్వేజ్ 2(ఇంగ్లిష్) | 30 | 30 |
4. | సంబంధిత సబ్జెక్ట్ | 60 | 60 |
మొత్తం | 150 | 150 |
- నాలుగో విభాగంగా నిర్వహించే సంబంధిత సబ్జెక్ట్ విషయంలో..మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్ అభ్యర్థులు మ్యాథ్స్, సైన్స్ విభాగాన్ని; సోషల్ టీచర్లు సోషల్ స్టడీస్ విభాగాన్ని ఎంచుకుని పరీక్ష రాయాలి.
పేపర్–2బి
విభాగం | సబ్జెక్ట్ | ప్రశ్నలు | మార్కులు |
1. | చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజి | 30 | 30 |
2. | లాంగ్వేజ్1 | 30 | 30 |
3. | లాంగ్వేజ్ 2(ఇంగ్లిష్) | 30 | 30 |
4. | డిజేబిలిటీ స్పెషలైజేషన్ సబ్జెక్ట్ అండ్ పెడగాజి | 60 | 60 |
మొత్తం | 150 | 150 |
- పేపర్–2బిలో నాలుగో విభాగంలో అభ్యర్థులు తాము స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులో చదివిన సబ్జెక్ట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అలా ఎంచుకున్న సబ్జెక్ట్ నుంచి 48 కంటెంట్ ప్రశ్నలు, 12 పెడగాజి సంబంధిత ప్రశ్నలు అడుగుతారు.
టీచర్ కొలువుకు తొలిమెట్టు.. టెట్‌లో అర్హత సాధించే ప్రణాళిక ఇదిగో..!
కనీస అర్హత మార్కులు
ఏపీ టెట్‌లోని అన్ని పేపర్లలోనూ అభ్యర్థులు తప్పనిసరిగా కనీస ఉత్తీర్ణత మార్కులు పొందాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో, బీసీ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.